Hyderabad: సైబర్ మోసాలతో రోజుకు రూ.4 కోట్ల నష్టం..!

దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. ఎంత అవగాహన కల్పించినప్పటికీ మోసగాళ్ల చేతిలో అమాయకులు చిక్కుకుంటున్నారు. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ మోసాల వల్ల తెలంగాణ వారు రోజుకు రూ. 4 నుంచి 5 కోట్ల వరకు నష్టపోతున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ శిఖా గోయెల్ తెలిపారు. హైదరాబాద్ వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ (హ్యాక్ 2.0) కార్యక్రమంలో మాట్లాడారు.

దేశంలోనే సైబర్ మోసాల వల్ల అత్యధికంగా నష్టపోతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని వివరించారు. 96 శాతం సైబర్ నేరాలు మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయడం లేదా స్కామర్‌లతో కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వంటి వల్ల సైబర్ నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదంతా మానవ తప్పిదాల ఫలితమేనని తెలిపారు. 1930 హెల్ప్‌లైన్‌కి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ కనీసం 1,200 డిస్ట్రెస్ కాల్‌లు వస్తాయని చెప్పారు. పెరుగుతున్న సైబర్‌క్రైమ్ మోసాలకు ఇది నిదర్శమన్నారు.

The people of Telangana state are losing Rs 4 crore per day due to cyber frauds

2035 నాటికి గ్లోబల్ సైబర్ క్రైమ్ నష్టం $10.5 ట్రిలియన్‌లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో H.A.C.K 2.0 సమ్మిట్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు, పరిశ్రమల ప్రముఖులను కలిసి పెరుగుతున్న సైబర్ ముప్పుపై చర్చించారు. మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, బ్రిజేష్ సింగ్ ఇంటర్నెట్ గురించి మాట్లాడారు. సైబర్ క్రైమ్ పరిశోధనలకు సహాయం చేయడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల సమ్మతి ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

కాగా ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా వచ్చారు. రాష్ట్రం "డిజిటల్ తెలంగాణ" చొరవకు సైబర్ భద్రత కేంద్రంగా ఉంటుందని అన్నారు. సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అమలు చేయడంలో తెలంగాణను అగ్రగామిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ అక్షరాస్యత, ఆన్‌లైన్ భద్రతను ప్రోత్సహించడానికి 'ఐ యామ్ రెడీ' ప్రచారాన్ని ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+