Kondagattu: కొండగట్టు ఆలయ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. !

కొండగట్టు ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు.

తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో మూడు రోజుల క్రితం చోరీ జరిగింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఈ దొంగతన జరగడంపై పలు విమర్శలు రావడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనానికి పాల్పడిన నిందితులను పట్టుకున్నారు.

నారాయణ్‌ఖేడ్‌

నారాయణ్‌ఖేడ్‌

నిందితులను కర్ణాటకలోని బీదర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరంతా మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. కొండగట్టు ఆలయంలో ఈనెల 24న శుక్రవారం చోరీ జరిగింది. గురువారం రాత్రి స్వామి వారి పవళింపు సేవ ముగిసిన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్లిపోయారు.

15 కిలోల వెండి

15 కిలోల వెండి

మరోసటి రోజు తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి దొంగలు చొరబడినట్టు గుర్తించారు . తొమ్మిది లక్షల విలువైన మకర తోరణం శఠగోపాలు, వెండి తొడుగు, వెండి వస్తువులు మొత్తం 15 కిలోల వెండిని చోరీ చేశారు. ఈ ఘటనపై భక్తులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు.

అర్ధరాత్రి 1.20 గంటలకు

అర్ధరాత్రి 1.20 గంటలకు

నిందితులు శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఆలయం వెనుక నుంచి గుడిలోకి వెళ్లారు. గుడిలో ఉన్న స్వామి వారి వెండి ఆభరణాలు సంచిలో వేసుకున్న వారు వెనుక వైపు నుంచి గుట్ట కిందకు దిగి వెళ్లిపోయినట్టు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. గుట్ట దిగిన దొంగలు మెయిన్‌రోడ్డు పైకి వెళ్లి బైకులపై కోరుట్ల, మెట్‌పల్లి మీదుగా కామారెడ్డి, నారాయణ్‌ ఖేడ్‌ నుంచి బీదర్‌ వెళ్లినట్టు పోలీసులు పోలీసులు గుర్తించారు.

ఎనిమిది మంది

ఎనిమిది మంది

బీదర్ వెళ్లిన పోలీసులు దొంగలను పట్టుకున్నారు. ఈ దొంగతనానికి ఎనిమిది మంది గ్యాంగ్‌ ప్లాన్‌ చేసినట్టు తెలిసింది. నిందితుల నుంచి ప్రస్తుతానికి వారి వద్ద నుంచి 60 శాతం ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగతా ఆభరణాలు రికవరీ అయ్యాక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+