KCR: బీఆర్ఎస్ కు షాక్.. కేసీఆర్ కు నోటీసులు..!
లోక్ సభ ఎన్నికల్లో చతికిలపడిన బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు నోటీసులు అందాయి. ఆయన సీఎంగా ఉన్న పదేళ్ల సమయంలో విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలకు సంబంధించి నోటీసులు అందాయి. "విద్యుత్ కొనుగోళ్లలో మీ పాత్ర ఏమిటి" నోటీసుల్లో పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 2024, జూన్ 30వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పవర్ కమిషన్ పేర్కొంది.
పవర్ కమిషన్ నోటీసులపై కేసీఆర్ బృందం స్పందించిట్లు తెలిసింది. జూలై 30వ తేదీలోపు సమాధానం ఇవ్వటానికి సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు కమిషన్ తెలిపింది. అయితే జూన్ 30వ తేదీలోపు సమాధానం చెప్పాలని కమిషన్ స్పష్టం చేసినట్లు సమాచారం. కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని కమిషన్ స్పష్టం చేసింది. జూన్ 30వ తేదీలోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందేనని పవర్ కమిషన్ స్పష్టం చేసింది.

భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందాలపై అప్పటి సీఎంగా కేసీఆర్ పాత్రపై ఉన్న అనుమానాలు, లోగుట్టుపై ఉన్న సందేహాలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. బీఆర్ఎస్ అధినేతకు నోటీసులు రావడంతో కింది స్థాయి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కవిత జైలులో ఉన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగుతోంది. తాజాగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా బీఆర్ఎస్ పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వీడేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లగా.. కొంత మంది బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications