Rice Price: భారీగా పెరుగుతోన్న సన్న బియ్యం ధరలు..
దేశంలో బియ్యం ధరలు పెరుగుతోన్నాయి. బియ్యం రకంతో సంబంధం లేకుండా అన్ని రకాల బియ్యం ధరలు పెరుగుతోన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. అయినప్పటికీ బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సన్న బియ్యం ధరలు భారీగా పెరిగాయి. గత పది రోజుల్లోనే క్వింటాకు రూ.600 నుంచి రూ.800 పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సోనామసూరి, బీపీటీ బియ్యం ధర రూ.6,500 పైగా పలుకుతోంది.
ఇక జైశ్రీరాం, హెచ్ఎంటీ రకాలు రూ.7 వేల వరకు పలుకుతున్నాయి. జైశ్రీరాం పాత రకం బియ్యానికి 25 కిలోలకు రూ.2 వేలకు చేరింది. దీన్ని జైశ్రీరాం పాత రకం బియ్యానికి రూ.8 వేలకు చేరిందని చెప్పుకోవచ్చు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకలో వర్షకాలం కాస్త వరి విస్తీర్ణం తగ్గినట్లు చెబుతున్నారు. ఏపీ, తమిళనాడులో తుఫాన్ ప్రభావం వల్ల పంట దెబ్బ తినడంతో దిగుబడి తగ్గింది. దీంతో బియ్యం ధరలు పెరిగాయ. యాసంగి కూడా భారీగా వరి విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది.

దీంతో బియ్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. బియ్యం పెరుగుతాయని ఊహించిన వ్యాపారులు రైతుల నుంచి సన్న వడ్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. వాటిని బియ్యంగా మార్చి ధరలు పెరిగినప్పుడు అమ్ముకుంటున్నారు. పలు చోట్ల కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెంచుతున్నారు. ఇటు అధికారులు గోదాముల దాడులు చేయడానికి సిద్ధమయ్యారు. వర్షకాలంలో చాలా మంది రైతులు దొడ్డు రకం వడ్లను మాత్రమే పండించారు.
సన్న వడ్ల దిగుబడి తక్కువ వస్తాయి. పైగా చీడపీడలు ఎక్కువ వస్తాయి. దీంతో రైతులు దొడ్డ రకం వైపు మళ్లారు. దీంతో సన్న బియ్యానికి భారీగా ధరలు పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గతంలో ఒక రాష్ట్రంలో సన్న వడ్లు వేయ్యాలని ప్రభుత్వం సూచించింది. తీర సన్న వడ్ల పండించాక దొడ్డు వడ్ల ధరకే సన్న వడ్లను కొనుగోలు చేశారు. దీంతో రైతులు నష్టపోయారు. అందుకే రైతులు సన్న వడ్లను వేయడానికి ఆసక్తి చూపడం లేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications