టికెట్ రిజర్వేషన్.. కన్ఫర్మేషన్ ఇక నుంచి - రైల్వే శాఖ తాజా నిర్ణయం..!!

రైల్వే శాఖ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. రిజర్వేషన్లలో ప్రయాణీకుల నుంచి వస్తున్న ఫిర్యాదులు.. సూచనలకు అనుగుణంగా కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే తత్కాల్ విధానం లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా, టికెట్ రిజర్వేషన్ చేసుకున్న తరువాత రైలు ప్రయాణానికి నాలుగు గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ ఛార్ట్ బయట పెడుతున్నారు. దీని కారణంగా టికెట్ కన్ఫార్మ్ కాని ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో, ఇప్పుడు ఈ విధానంలో మార్పు తెస్తూ కొత్త నిర్ణయం అమలుకు రైల్వే శాఖ సిద్దమైంది.

రైల్వే ప్రయాణీకులకు రిజర్వేషన్ ఖరారు వేళ ఎదురవుతున్న ఇబ్బందులను తెలిగించేందుకు తాజాగా రైల్వే బోర్డు కీలక ప్రతిపాదన చేసింది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నా.. రైలు బయల్దేరటానికి నాలుగు గంటల ముందు వరకు నిర్ధారిత సమాచారం అందటం లేదు. దీంతో, ఇక నుంచి రైళ్లు బయలుదేరడానికి ఎనిమిదిగంటల ముం దే రిజర్వేషన్‌ చార్టులను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల రైల్వే అధికారులతో చేసిన సమీక్షలో భాగంగా ప్రయాణీకుల నుంచి పెద్ద సంఖ్యలో ఈ సమస్య పైన వస్తున్న అభ్యంతరాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునే వెసులుబాటు కలగనుంది.

the-railway-board-proposed-preparing-the-reservation-chart-eight-hours-before-the-departure

అదే సమయంలో టికెట్ వ్యవస్థ స్మార్ట్ గా ఉండటంతో పాటుగా పారదర్శకంగా.. సమర్ధవంతంగా ఉండేలా చర్యలు చేపట్టారు. రైలు బయల్దేరటానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ ఛార్ట్ ప్రకటన వలన ప్రయాణీకుల్లో తమ ప్రయాణం పైన అనిశ్చితి కనిపిస్తోంది. దీంతో, ఇక నుంచి ఎనిమిది గంటల ముందే ఈ ఛార్ట్ లను విడుదల చేయనున్నారు. ఖాళీలు ఉంటే కరెంట్ బుకింగ్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు.

వెయిటింగ్‌ లిస్ట్‌ స్టేటస్‌ మరింత ముందుగానే తెలియడంతో దూర ప్రాంతాలు.. శివారు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రయోజన కరంగా ఉంటుంద ని అధికారులు భావిస్తున్నారు. ఇక, జులై ఒకటి నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి మార్పులు ఉంటాయి. ఇకపై అథెంటికేషన్‌ యూజర్స్‌ మాత్రమే తత్కాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+