జాదూ చేసిన జాదూ కంపెనీ విత్తనాలు.!మంత్రి నిరంజన్ తో మొరపెట్టుకున్న రైతులు.!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అద్వర్యంలో మనోపాడ్ మండల రైతులు వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డితో భేటీ అయ్యారు. జోగులంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ తాలూకా మనోపాడ్ మండలంలో 26 వేల జాదు కావేరి పత్తి వేసి పంట చేతికి రాక నష్టపోయిన విషయం తెలిసిందే. 10 వ తేదీన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మనోపాడ్ పర్యటన సందర్భంగా రైతులు ఈ అంశాన్ని సంపత్ దృష్టికి తెచ్చారు. అదే రోజు మంత్రి నిరంజన్ రెడ్డితో సంపత్ కుమార్ ఫోన్ లో సంప్రదించగా 13 వ తేదీ హైదరాబాద్ లో కలిసి, అదే అంశంపై చర్చించాల్సిందిగా చెప్పారని సంపత్ గుర్తు చేసారు. శనివారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సమావేశమై చర్చించినారు.

పంట నష్టపోయిన రైతాంగం పట్ల మంత్రి సానుకూలంగా స్పందించి, శాస్త్ర వేత్తలతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని సంపత్ తెలిపారు. ఎంపీపీ అశోక్ రెడ్డి వేల్పుల రవి నేతాజీ గౌడ్ శేఖర్ రెడ్డి రైతులు కలసి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన పత్తి విత్తనాలను వేశారని, కానీ అందులో జాదు కంపెనీకి చెందిన పత్తి విత్తనాలు వేసిన రైతులకు మాత్రం చేదు అనుభవం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో ఎన్నడూ కూడా ఈ ప్రభావం చూపని రైతులకు జాదు పత్తి విత్తనాలు నష్టాల ఊబిలోకి నెట్టేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివారం సంపత్ కుమార్ మరియు మనోపాడ్ మండల రైతులతో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మరోసారి భేటీ కానునన్నారు.












Click it and Unblock the Notifications