Telangana: రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..!

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే రేషనా కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అన్ని రంగాల్లో రాష్ట్రాని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సంవత్సర కాలంగా అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని గుర్తు చేశారు. అయినప్పుటీకి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

ఫాక్స్‌కాన్ పెట్టుబడుల అంశంలో కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నట్లు పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రతిపక్షాల ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైడ్రా కేవలం అక్రమార్కుల ఆట కట్టించడానికేనని చెప్పారు. పేదవారి ఇళ్లను హైడ్రా ముట్టుకోదని చెప్పారు. హైడ్రా ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పేదలు మురికి కూపాల్లో ఉండాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఆలోచన అని ఆరోపించారు.

The state government has announced that it will provide Small rice to ration card holders

అసలు మూసీ ప్రాజెక్టుకు, రాబర్ట్‌వాద్రాకు ఏంటి సంబంధం ఏంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ 3వ సారి గెలిచినా తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. బీజేపీ మెప్పు కోసమే తమపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని.. ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్ ను నిలబెడతామని చెప్పారు. గత పదేళ్లలో చిన్నాభిన్నమైన తెలంగాణ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.

గత అప్పులకు 10 నెలల్లో రూ.50వేల కోట్ల వడ్డీ కట్టామని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రైతు రుణ మాఫీ, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+