హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ సర్కార్ సయోధ్య- కీలక నిర్ణయం- బడ్జెట్ తేదీల్లో..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై దాఖలు చేసిన లంచ్ పిటీషన్ ను ఉపసంహరించుకుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్- ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతోన్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెర పడినట్టే కనిపిస్తోంది. ఘర్షణ వైఖరికి పుల్ స్టాప్ పెట్టింది. గవర్నర్ తో సయోధ్య దిశగా ఓ అడుగు ముందుకు వేసింది. తమిళిసైపై న్యాయపరమైన యుద్ధానికి దిగిన కేసీఆర్ ప్రభుత్వం.. కొన్ని గంటల వ్యవధిలోనే అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో- బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రసంగానికి రాజ్ భవన్ ఇంకా ఆమోదం తెలపట్లేదనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమిళిసై సౌందరరాజన్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ నెల 3వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాల్సి ఉందని, దీనికి అవసరమైన ప్రతిపాదనలను రాజ్ భవన్ కు పంపించినప్పటికీ- ఇంకా ఆమోదం లభించట్లేదని పేర్కొంది.

The Telangana government has withdrawn the petition against Governor Tamilisai Soundararajan

ఈ ప్రతిపాదనలను ఆమోదించేలా గవర్నర్ కార్యాలయాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ పిటీషన్ ను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనానికి సమాచారాన్ని పంపించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే- వెల్లడించారు.

తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో కేసీఆర్ ప్రభుత్వం- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల్లో సవరణలను చేసింది. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 3వ తేదీన ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది కూడా. తాజాగా సంభవించిన ఈ పరిణామంతో ఈ తేదీలో మార్పులు చేసింది. 6వ తేదీకి వాయిదా వేసింది.

కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి- ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న విషయం తెలిసిందే. ఆగస్టు-సెప్టెంబర్ మధ్య షెడ్యూల్ వెలువడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అవుతుంది. వచ్చే బడ్జెట్ ను కొత్త ప్రభుత్వం ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో- బడ్జెట్ సమావేశాలను సజావుగా కొనసాగింపజేసేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటోన్నారు.

సెక్స్ స్కాండల్ సీడీ వ్యవహారం సీబీఐ చేతికి- రమేష్ జార్కిహోళి మళ్లీ తెరమీదికి..!!సెక్స్ స్కాండల్ సీడీ వ్యవహారం సీబీఐ చేతికి- రమేష్ జార్కిహోళి మళ్లీ తెరమీదికి..!!

English summary
The Telangana government has withdrawn the petition against Governor Tamilisai Soundararajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X