అరాచకాన్ని మొత్తం ప్రపంచం చూస్తోంది.!బ్రిజ్ భూషణ్ సింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలన్న కవిత.!
హైదరాబాద్ : రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం చంద్రవేఖర్ రావు కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసనలు ఆందోళనలు తెలుపుతున్నా కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంలో కేంద్రం తగు చర్యలకు ఉక్రమించకపోతే క్రీడాకారులు ఆత్మ స్తైర్యాన్ని కోల్పోయే ప్రమాదం పొంచిఉందని కవిత ఆవేదన వ్యక్తం చేసారు.

దేశానికి బంగారు పతకాలు సాధించిన మహిళ క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రపంచమంతా చూస్తోందని, దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత సూచించారు.












Click it and Unblock the Notifications