వివాహేత‌ర సంబంధానికి అడ్డొస్తున్నాడ‌ని...భ‌ర్త‌ను చంపించిన భార్య‌...

భాగ్య‌నగ‌రం శివారు జవహర్ నగర్ అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం బ‌య‌ట‌ప‌డ్డ మృత‌దేహం కేసును పోలీసులు ఎట్ట‌కేల‌కు ఛేధించారు. ఈ హ‌త్య కేసు విష‌యంలో ముగ్గురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. ఈ దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కార‌ణ‌మ‌నీ పోలీసులు నిర్ధారించారు. మృతుడు జవహర్‌నగర్‌ ముత్తుస్వామికాలనీకి సందిరి స్వామిగా పోలీసులు గుర్తించారు. ఈ హ‌త్య‌కు వివాహేతర సంబంధమే కారణమని.. భార్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

ఇక ఈ వివ‌రాల‌ను ఓసారి ప‌రిశీలిస్తే... జవహర్‌నగర్‌ ముత్తుస్వామికాలనీకి నివాసముండే సందిరి స్వామి(35) గ‌త కొంత కాలంగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య కావ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కావ్య ఇంటి వద్ద ఉంటూ టైల‌రింగ్ చేస్తుంటుంది. అయితే, వీరి ఇంటి ఎదురుగా సిద్దిపేట జిల్లా బద్దిపడిగకు చెందిన కర్నాల ప్రణయ్‌(26) అనే యువకుడు అద్దెకు నివ‌సిస్తుండేవాడు.

The wife who killed her husband said that he was preventing her from having an extra marital affair.

ఈ క్రమంలో ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న ప్రణయ్ కుమార్‌తో కావ్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఏడాది కాలంగా ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రణయ్‌కి అవసరమున్నప్పుడల్లా కావ్య డ‌బ్బుఇచ్చేది. ఈ క్ర‌మంలో కావ్య తన ఆరు తులాల బంగారం, రూ.5 లక్షల నగదు, లోన్ యాప్‌లో రూ.3 లక్షలను తీసుకుని మ‌రీ బాయ్‌ఫ్రెండ్ ప్రణయ్‌కు ఇచ్చింది. కావ్య ఇచ్చిన డ‌బ్బుతో ప్రణ‌య్ ఎంజాయ్ చేసేవాడు.

అనంత‌పూర్ టూర్ వెళ్దామ‌ని న‌మ్మించారు..

వీరిద్దరి అక్రమ సంబంధంపై కావ్య భర్త అనుమానం వ‌చ్చింది. ఈ విష‌యంపై ప‌లుమార్లు వీరిద్ద‌రూ గొడ‌వ‌లు కూడా ప‌డ్డారు. అదే విషయాన్ని కావ్య ప్రణయ్‌తో పూస‌గుచ్చిన‌ట్లు చెప్పింది. స్వామి అడ్డు తొలగిపోతే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని భావించిన కావ్య భ‌ర్త‌ను చంపేందుకు ప్ర‌ణాళిక వేసింది. ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా నిజామాబాద్‌లో ఉండే స్నేహితుడు పసులోటి రోహిత్‌తో జ‌త‌క‌ట్టారు. జనవరి 26న స్నేహితులతో కలిసి అనంతపూర్ టూర్‌కు వెళ్తున్నామని, తమ కారుకు డ్రైవర్‌గా వస్తే రోజు కూలీ ఇస్తామని చెబితే అందుకు స్వామి ఒప్ప‌కున్నాడు.

అలా స్వామిని న‌మ్మించి నిజామాబాద్‌ తీసుకెళ్లి స్నేహితుడి సాయంతో కత్తితో పొడిచి చంపేశాడు ప్ర‌ణ‌య్‌. అనంత‌రం స్వామిని హత్యచేసిన విష‌యాన్ని కావ్య‌కు చెప్పాడు. ఒకరోజు మెుత్తం కారు డిక్కీలోనే మృతదేహాన్ని పెట్టుకొని చ‌క్క‌ర్లు కొట్టారు. మరుసటి రోజు స్వామి మృతదేహాన్ని జవహర్‌నగర్‌కు తీసుకొచ్చారు. అక్క‌డ బాలాజీనగర్‌కు చెందిన మబ్బు నాగేశ్‌ అనే వ్యక్తి సాయంతో ప్లాస్టిక్‌ సంచి, పెట్రోల్ తీసుకుని, అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని కాల్చేసారు. ఆ త‌ర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కావ్య పరారీలో ఉండగా, ఈ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయ‌డం జ‌రిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+