అర్ధరాత్రి దొంగల బీభత్సం: వినూత్న తరహాలో దొంగతనం

Subscribe to Oneindia Telugu

హన్మకొండ: నగర పరిధిలోని వడ్డెపల్లి చర్చి సమీపంలో నరేంద్రపురి కాలనీలో మంగళశారం దొంగలు బీభత్సం సృష్టించారు. నరేంద్రపురి కాలనీలో రెండిళ్లలో, సమీపంలోని విష్ణుపురి కాలనీలో ఒకర్లిోంకి తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య చొరబడ్డారు.

ఒకరింట్లో రూ.35వేల నగదు, 12 తులాల బంగారం, మరొకరి ఇంట్లో రూ. 2500 నగదు దొంగలించుకుపోయారు. కికీలు, డోర్లు పగులగ్టొి ఇళ్ళలోకి చొరబడిన దొంగలు దోచుకెళ్తున్నప్పికీ ఇళ్లలో నిద్రిస్తున్న వారికి ఎలాంటి అలికిడి కాకపోవడం విశేషం.

theft

ఏదో మత్తుమందు ఇచ్చినట్లు పడుకున్నామని బాధితులు తెలిపినప్పికీ అదే నిజమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లోనికి వచ్చిన దొంగలు నిద్రిస్తున్న వారు లేవకుండా ఏదైనా మత్తు స్ప్రే చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసుల అనుమానాల మేరకు ఏదైనా బయి రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా నగరానికి చేరుకుండా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం ఉదయం నిద్రలో ఉన్న సమయంలో నరేంద్రపురి కాలనీలోని జాన్‌ సుజయ్‌ ఇంటిలోకి చొరబడ్డారు.

ఇంటి గేటు దూకిన దొంగలు వంట రూము గ్రిల్‌ను తొలగించి లోనికి వెళ్ళారు. దొంగలు సుజయ్‌ తల్లి పడుకున్న రూముకు వెళ్లి ఆమె దిండు కింద ఉన్న బీరువా తాళాలు తీసుకున్నారు. తాళాలు తీసుకుని సుజయ్‌ రూమ్‌లో ఉన్న బీరువాను తెరిచి రూ. 35 వేల నగదు, 12 తులాల బంగారాన్ని దొచుకెళ్లారు. దుస్తులు, ఇతర వస్తువులను ఇళ్లంతా చెల్లాచెదురు చేసి వెళ్లారు.

ఇదే కాలనీలోని పెరుగు ప్రభాకర్‌ ఇంటికి వెళ్ళిన దొంగలు వంట రూము గ్రిల్‌ గుండా పొడువాటి రాడుతో ఇంటి వెనుకాల డోర్‌ గడను తీసి లోనికి వెళ్లారు. ఒక రూములో పిల్లలు, మరో రూములో ప్రభాకర్‌ నిద్రిస్తున్నారు.

పిల్లల రూములోకి వెళ్లి సూటుకేసు తీసుకొని హాల్‌లోకి వచ్చి పరిశీలించగా ఎలాంటి వస్తువులు దొరకకపోవడంతో ఇదే గృహంలో అద్దెకు ఉంటున్న రాజు ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు.

రాజు కుటుంబంతో ఊరెళ్లగా తాళం పగులగొట్టి రూ. 2500 నగదును దోచుకెళ్లారు. పోతూపోతూ సమీపంలోని విష్ణుపురి కాలనీకి చెందిన నవీన్‌ గృహంలో దొంగతానానికి యత్నించారు. గేటు దూకిన దొంగలు కికీని పగులగొట్టేందుకు యత్నించి సాధ్యంకాకపోవడంతో వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న కేయూ సీఐ అలీ, ఎస్‌ఐలు జి. సుబ్బారెడ్డి, కె. అశోక్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడంతో పాటు క్లూస్‌ టీం, క్రైమ్‌ పోలీసులకు సమాచారం అందించారు. క్లూప్‌ టీం సీఐ రఘు, ఎస్‌ఐ రాజేందర్‌లు ఫింగర్‌ ప్రింట్స్ తీసుకోగా క్రైమ్‌ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Theft in Hanmakonda.
Please Wait while comments are loading...