BRS: పార్టీ మారేందుకు సిద్ధమైన 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ కథ ముగిసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. దీంతో అందులో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటే తమకు భవిష్యత్ ఉండని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నాట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో బీఆర్ఎస్ బలం 38 కి తగ్గింది. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 22 మంది పార్టీ మారి అధికార పక్షంలో విలీనం అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు ఇప్పటికే పార్టీ మారారు. మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమైతే ఫిరాయింపు చట్టం వర్తించదని చెబుతున్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలు తమను వేరే వర్గంగా గుర్తించి.. అసలైన బీఆర్ఎస్ఎల్పీగా గుర్తించాలని స్పీకర్ ను కోరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications