అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!

హైదరాబాద్‌: అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్‌ జరగాలి. అతై అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మద్య ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎన్నికకు ఏర్పాట్లు చేసినట్టు ఈసీ స్పష్టం చేస్తున్నారు.

 ఉత్కంఠభరింతాగా నిజామాబాద్ ఎన్నిక..! అందరిచూపు అటువైపే..!!

ఉత్కంఠభరింతాగా నిజామాబాద్ ఎన్నిక..! అందరిచూపు అటువైపే..!!

నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మాక్‌ పోలింగ్‌ పూర్తి చేయటానికి సమయాన్ని మార్చాల్సి వచ్చింది అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. ఆదివారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఒక్క నిజామాబాద్‌లోనే పోలింగ్‌ సమయం మారిందని.. మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం అయిదు వరకు జరుగుతుందన్నారు. నిజామాబాద్‌లో అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మాక్‌ పోలింగ్‌ నిర్వహించామని.. ఎంత సమయం పడుతుందన్న దానిపై అంచనా వేశామన్నారు.

 ఎన్నికల తేదీ మార్పు కుదరదు..! ర్యాలీ చేసుకోవచ్చన్న ఈసీ..!!

ఎన్నికల తేదీ మార్పు కుదరదు..! ర్యాలీ చేసుకోవచ్చన్న ఈసీ..!!

ఎన్నికల ఏర్పాట్లపై పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశామని చెప్పారు. తొమ్మిదో తేదీన నిజామాబాద్‌లో రైతులు ర్యాలీ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఎన్నికల తేదీని మార్చాలన్న ఆయా అభ్యర్థుల వినతిని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని వివరించారు.

 నిజామాబాద్ పోల్ కోసం సర్వం సిద్దం..! ఎక్కువ సంఖ్యలో అదికారులను సిద్దం చేసామన్న ఈసీ..!!

నిజామాబాద్ పోల్ కోసం సర్వం సిద్దం..! ఎక్కువ సంఖ్యలో అదికారులను సిద్దం చేసామన్న ఈసీ..!!

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం కోసం హెలికాఫ్టర్‌ అందుబాటులో ఉంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో హెలిప్యాడ్‌లను సిద్ధం చేస్తున్నాం. ఈవీఎం ఇంజినీర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ఒక్కో సెక్టార్‌ అధికారి వెంట ఒక్కో ఇంజినీరు అందుబాటులో ఉంటారు. రాష్ట్రానికి అదనపు కేంద్ర పోలీసు బలగాలు కావాలని కోరాం. ఇతర రాష్ట్రాల పరిస్థితులను అంచనా వేసిన మీదట పంపుతామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. మాజీ సైనికుల సేవలను వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించుకోనున్నామని రజత్ కుమార్ తెలిపారు.

 అడుగడుగునా అప్రమత్తం..! నిజామాబాద్ లో అంతటా కట్టుదిట్టం..!!

అడుగడుగునా అప్రమత్తం..! నిజామాబాద్ లో అంతటా కట్టుదిట్టం..!!

అంతే కాకుండా ఎన్నికల విధులకు ఎవరు ఆటంకం కలిగించినా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. అన్ని నియోజకవర్గాల్లో ఫొటో ఓటరు పత్రాలు, ఓటరు గుర్తింపు కార్డులను 95 శాతం పంపిణీ చేశాం. నాలుగు సంవత్సరాల రాష్ట్ర ప్రగతి గురించి ప్రభుత్వం నివేదికను ఆవిష్కరించటంపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిపై ఫిర్యాదు చేశారు. అందులోని అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తాం.. అని ఎన్నికల అదికారి రజత్‌కుమార్‌ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+