మానవరూప రాక్షసుడు : ఆ ముగ్గురిని చంపింది ఉన్మాదే, రాచకొండ సీపీ వెల్లడి

హైదరాబాద్ : అతడు మానవరూప రాక్షసుడు. నరనరాన కామంతో రగిలిపోతుంటాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడటంతో గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో అతనిలో నేర ప్రవృత్తి మరింత పెరిగి .. సైకోలా మారాడు. గత నాలుగేళ్ల నుంచి అమ్మాయిలకు లిఫ్ట్ ఇస్తూ .. లైంగికదాడికి పాల్పడుతూ హత్యచేస్తున్నాడని శ్రీనివాస్ రెడ్డి నేరచరితను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వివరించారు.

ఉన్మాదిలా మారిందిలా ?

ఉన్మాదిలా మారిందిలా ?

‌యువతిపై రేప్, తర్వాత దేహశుద్ది చేయడంతో రగిలిపోయిన శ్రీనివాస్ రెడ్డి .. ఒంటిరిగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేసి లిఫ్ట్ ఇచ్చి నమ్మకం కలిగించేవాడు. ఆ తర్వాత తన తోటలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి .. హతమార్చేవాడని సీపీ పేర్కొన్నారు. అతనిలో ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి జరిగిన ఘటనలే సజీవ సాక్ష్యమని తెలిపారు.

కదిలిన డొంక

కదిలిన డొంక

శ్రావణి మిస్సింగ్‌తో నరరూప రాక్షసుడు శ్రీనివాస్ అరాచకాలు బయటపడ్డారు. ఈ నెల 25న శ్రావణి కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖాకీలు .. షీ టీమ్స్, ఐటీ సెల్, పోలీసులు కేసును దర్యాప్తు చేశాయి. 2017లో శ్రీనివాస్‌పై కర్నూలులో సెక్స్ వర్కర్ హత్యకేసులో అరెస్టైనట్టు గుర్తించారు. అతనికేమైనా సంబంధం ఉందా అని రావిల్యాలలో ఉన్నట్టు సమాచారం రావడంతో అదుపులోకి విచారిస్తే డొంక కదిలినట్టు సీపీ వివరించారు.

గాయాలతో ఉన్న రేప్ ..

గాయాలతో ఉన్న రేప్ ..

శ్రావణి కన్నా ముందు శివరాత్రి రోజున మనీషా కనిపించకుండా పోయింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శ్రావణి మృతదేహం తర్వాత మనీశా డెడ్ బాడీ దొరకడంతో శ్రీనివాస్ హత్యోందంతం ప్రక్రియ వెలుగులోకి వచ్చింది. మనీశాకు లిప్ట్ ఇచ్చిన శ్రీనివాస్ .. బావిలోకి నెట్టేశాడని సీపీ తెలిపారు. ఆమె గాయాలతో ఉన్నప్పుడే లైంగికదాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

కల్పనపై అఘాయిత్యం ...

కల్పనపై అఘాయిత్యం ...

2015లో శ్రీనివాస్ కు జరిగిన అవమానం తర్వాత .. సైకోలా మారి అమ్మాయిల వేటలో పడ్డాడని సీపీ తెలిపారు. 2015లో హజీపూర్‌లో బంధువులు ఇంటికి వెళ్లినప్పుడే కల్పన కనిపించకుండా పోయింది. కల్పనపై లైంగికదాడి చేసినట్టు శ్రీనివాస్ రెడ్డి విచారణలో అంగీకరించారు. కల్పనపై రేప్ చేసి .. తర్వాత హతమార్చి డెడ్ బాడీ సంచిలో పెట్టి తీసుకెళ్లి మరో బావిలో వేసినట్టు విచారణలో నిందితుడు అంగీకరించారని పేర్కొన్నారు.

వన్ మ్యాన్ సైకో .. శ్రీనివాస్ రెడ్డి

వన్ మ్యాన్ సైకో .. శ్రీనివాస్ రెడ్డి

బొమ్మలరామారం పరిధిలో జరిగిన ఘాతుకాలన్నీ తాను ఒంటరిగానే చేసినట్టు నిందితుడు అంగీకరించాడని సీపీ తెలిపారు. శ్రావణి, మనీషా, కల్పన హత్య కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ఇవేకాదు శ్రీనివాస్ రెడ్డి గతంలో ఉన్న వేములవాడ, కరీంనగర్, ఆదిలాబాద్ లో దారుణాలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని వివరించారు. నిందితుడు శ్రీనివాస్ పై కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+