తెలుగు రాష్ట్రాల్లో టాప్-10 కుబేరులు వీరే.. 2025 జాబితా విడుదల
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్-10 కుబేరులు ఎవరనే జాబితా 2025ను ఎం3ఎం హురున్ ఇండియా విడుదల చేసింది. వీరిలో నెంబర్ వన్ స్థానంలో దివీస్ ల్యాబ్స్ అధినేత దివిస్ మురళి నిలిచారు. ఆయన సంపద 91,100 కోట్లుగా ఉంది. మురళికి చెందిన దివీస్ ప్రపంచంలో సగానికి పైగా దేశాలకు ఫార్మాకు సంబంధించిన ముడిసరకును సరఫరా చేస్తోంది. దేశవ్యాప్తంగా కుబేరుల జాబితాలో ఆయనకు 21వ స్థానం దక్కింది.
42,650 కోట్లతో మేఘా ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు పి.పిచ్చిరెడ్డి 2వ స్థానంలో నిలిచారు.
41,810 కోట్లతో మేఘా ఇంజనీరింగ్ మేనేజింగ్ పార్ట్ నర్ పి.వి.కృష్ణారెడ్డి 3వ స్థానంలో
39,030 కోట్లతో హెటెరో అధినేత బి.పార్థసారథిరెడ్డి 4వ స్థానంలో
33,160 కోట్లతో అపోలో గ్రూప్ అధినేత ప్రతాప్ సి.రెడ్డి 5వ స్థానంలో
31,340 కోట్లతో జీఎంఆర్ గ్రూప్ అధినేత జీఎం రావు 6వ స్థానంలో
22,940 కోట్లతో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ చైర్మన్ ఎంఎస్ఎన్ రెడ్డి 7వ స్థానంలో
20,240 కోట్లతో అపర్ణ కన్ స్ట్రక్షన్స్ ఎస్.సుబ్రమణ్యం రెడ్డి 8వ స్థానంలో
20,030 కోట్లతో అపర్ణ కన్ స్ట్రక్షన్స్ సి.వెంకటేశ్వరరెడ్డి 9వ స్థానంలో
17,590 కోట్లతో రెడ్డీ ల్యాబ్స్ ఎండీ కె.సతీష్ రెడ్డి 10వ స్థానంలో నిలిచారు.

మనదేశంలో రోజురోజుకు సంపద సృష్టించేవారి జాబితా పెరుగుతోంది. కొత్తగా బిలయనీర్లు పుట్టుకొస్తున్నారు. భారత్ ల 350కి పైగా బిలయనీర్లు ఉన్నారు. 13 సంవత్సరాల్లో వీరి సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఎం3ఎం హురున్ ఇండియా అభిప్రాయపడింది.
జాబితాలో లేనవారి దగ్గరే ఎక్కువ ఉంది
వాస్తవానికి ఈ జాబితాలో ఉన్నవారికంటే లేనివారి దగ్గరే ఎక్కువ సంపద ఉంది. అందుకు ఉదాహరణగా మనకు చాలామంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఏపీ, తెలంగాణలో కనపడుతూనే ఉంటారు. కాకపోతే వారి దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది. టాప్-10 మంది చూపించింది వైట్ మనీ. అయితే వీరే అంత వైట మనీ చూపించారంటే వారి దగ్గర బ్లాక్ మనీ కూడా ఉంటుంది కదా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేశమైనప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా బిలయనీర్లు పుట్టుకురావడంతోపాటు సంపదను కూడా సృష్టిస్తుండటం ఆనందించదగ్గ విషయం. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 9.55 లక్షల కోట్లతో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచారు.












Click it and Unblock the Notifications