సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ఇష్టపడని ఐఏఎస్ లు వీరే!

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల ఏడోతేదీన ప్రమాణ స్వీకారం చేశారు. నేటితో నాలుగు రోజలవుతోంది. ప్రగతి భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తుండటంతో ప్రజలు నేరుగా కలుస్తున్నారు. అలాగే ఈ నాలుగు రోజుల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసపెట్టి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. అయితే ఇంతవరకు రేవంత్ ను కలవని ఐఏఎస్ లు కూడా ఉన్నారు. వారెవరంటే..

స్మిత సబర్వాల్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, ప్రియాంక వర్గీస్.. వీరు మాత్రం ఇంతవరకు కలవలేదు. వీరిపై బదిలీ వేటు పడుతుందంటున్నారు. స్మిత సబర్వాల్ ముఖ్యమంత్రి సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఇరిగేషన్ అదనపు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రియాంక వర్గీస్ ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీగా పనిచేశారు. స్మిత సబర్వాల్ తో కలిసి మిషన్ భగీరథ పనులు పర్యవేక్షించారు.

these IAS do not want to meet cm revanth reddy

పరిశ్రమలు, ఐటీ శాఖను పర్యవేక్షించిన జయేష్ రంజన్ మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అరవింద్ కుమార్ పురపాలక కార్యదర్శిగా పనిచేశారు. ఈయన కూడా కేటీఆర్ కు దగ్గరయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు విషయంలో వివరాలు కావాలని అడిగితే రేవంత్ రెడ్డికి అప్పుడు మున్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో అరవింద్ కుమార్ పని తీరు పట్ల రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

వీరంతా ముఖ్యమంత్రిని కలవడానికి ఇష్టం చూపడంలేదని తెలుస్తోంది. వీరితోపాటు దేవాదాయ శాఖలో తన సర్వీస్ ఎక్స్ టెన్షన్ లో ఉన్న అనిల్ కుమార్, జీఏడీ ప్రోటోకాల్ సెక్రటరీ అరవింద్ సింగ్ ను కూడా ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+