హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: భారత్‌లో కొవిడ్ 3వ వేవ్ -జులై 4నే మొదలైంది: హైదరాబాద్ ఫిజిసిస్ట్ -461రోజుల డేటాతో

|
Google Oneindia TeluguNews

దేశంలో కొవిడ్ మహమ్మారి రెండో దశ విలయం ఇంకా ముగియలేదని కేంద్రం హెచ్చరిస్తన్నది. అయినాసరే, చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపుల కారణంగా జన సంచారం మళ్లీ పెరిగింది. ఉత్తరాదిలోని పర్యాటక కేంద్రాలకు ప్రజలు పోటెత్తడంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈలోపే ఈశాన్య రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ కలకలం పెరుగుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో సమీక్షలకు సిద్ధమయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై కేంద్రం ఆందోళన మాత్రమే వ్యక్తం చేస్తున్నప్పటికీ, థర్డ్ వేవ్ పై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, వాస్తవంగా దేశంలో కొవిడ్ మూడో దశ విలయం ఇప్పటికే ఆరంభమైందట..

జగన్ సర్కారు ఖర్చులు: బ్లాక్, వైట్ బిల్లులా? -ఆ ప్రధానికి చంద్రబాబు భయపడలేదా?: సాయిరెడ్డి ధ్వజంజగన్ సర్కారు ఖర్చులు: బ్లాక్, వైట్ బిల్లులా? -ఆ ప్రధానికి చంద్రబాబు భయపడలేదా?: సాయిరెడ్డి ధ్వజం

జులై 4 నుంచే 3వ వేవ్..

జులై 4 నుంచే 3వ వేవ్..

భారత్ లో కొవిడ్ థర్డ్ వేవ్ మొదలైందా? అంటే, అవుననే వాదిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫిజిసిస్ట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్) మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విపిన్ శ్రీవాస్తవ. గడిచిన 15 నెలలకుపైగా, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, గత 461 రోజులుగా కొవిడ్ రోజువారీ డేటాను క్షుణ్నంగా పరిశీలిస్తూ, తనదైన విశ్లేషణలు చేస్తోన్న ఆయన, దేశంలో ఇప్పటికే కొవిడ్ మూడో వేవ్ మొదలైందని, తన లెక్క ప్రకారం జులై 4నుంచే థర్డ్ వేవ్ కొనసాగుతున్నట్లు డాక్టర్ శ్రీవాస్తవ తెలిపారు.

రేవంత్‌కు పీసీసీ, కోతికి కొబ్బరి చిప్ప -కాంగ్రెస్‌కు మరో షాక్ -కొట్లాడేది టీఆర్ఎస్సే: కేటీఆర్ -రమణ తర్వాత..రేవంత్‌కు పీసీసీ, కోతికి కొబ్బరి చిప్ప -కాంగ్రెస్‌కు మరో షాక్ -కొట్లాడేది టీఆర్ఎస్సే: కేటీఆర్ -రమణ తర్వాత..

రోజువారీ మరణాల ఆధారంగా..

రోజువారీ మరణాల ఆధారంగా..

దేశంలో కొవిడ్ మూడో వేవ్ జులై 4 నుంచే మొదలైందని నిర్ధారించుకోడానికి "డైలీ డెత్ లోడ్" (డీడీఎల్-రోజువారీ మరణాలు)ను కొలమానంగా తీసుకున్నానని, గడిచిన 461రోజులుగా ఇన్ఫెక్షన్, మరణాల రేటులో మార్పుల ఆధారంగా తాను విశ్లేషణ చేశానని డాక్టర్ శ్రీవాస్తవ చెప్పారు. దేశంలో జూలై 4 తర్వాత నుంచి కేసులు, మరణాల తీరు అచ్చంగా రెండో వేవ్ ప్రారంభంలో, అంటే, 2021 ఫిబ్రవరి మాదిరిగానే ఉన్నాయని, ఫిబ్రవరి నుంచి మొదలైన సెకండ్ వేవ్, ఏప్రిల్ నాటికి తీవ్రతరం అయినట్లుగానే ఈ సెప్టెంబర్ నాటికి మూడో వేవ్ ఉధృతం అవుతుందని శ్రీవాస్తవ తెలిపారు.

Recommended Video

Zika Virus : Karnataka Issues Guidelines To Prevent Zika Virus | Kerala | Oneindia Telugu
మూడో వేవ్ ముప్పు తప్పాలంటే..

మూడో వేవ్ ముప్పు తప్పాలంటే..

''24 గంటల్లో కోలుకున్న రోగుల సంఖ్య అదే 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్యను మించినప్పుడు ఇది ప్రతికూలంగా ఉంటుంది. రోజువారీ మరణాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా మూడో వేవ్ కు అనుకూలమైన పరిస్థితి తలెత్తుతుంది. ఉదాహరణకు, 2021మేలో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మే 6 నుంచి 17 వరకు 10 రోజుల వ్యవధిలో డీడీఎల్ (రోజువారీ మరణాలు) భారీగా పెరిగాయి. ఇది క్రాస్ఓవర్ జరుగుతోందని సంకేతాలు ఇచ్చింది. ఫిబ్రవరి మధ్యలో చోటుచేసుకున్న మరణాలు రెండో వేవ్ రాకను సూచించాయి. జూలై 4 నుంచి ఇప్పటివరకు డీడీఎల్ 0.51 నుంచి మైనస్ 0.855 పరిధిలో ఉంది. ఇది థర్డ్ వేవ్ రాకకు సూచనే'' అని హైదరాబాద్ టాప్ ఫిజిసిస్ట్ డాక్టర్ బిపిన్ శ్రీవాస్తవ వివరించారు. కాగా, మాస్క్ ధారణ, సోషల్ డిస్టెన్సింగ్, వ్యాక్సినేషన్ ను పక్కాగా అమలు చేయడం ద్వారా మూడో వేవ్ ప్రమాదాన్ని నివారించొచ్చని ఆయన హితవుపలికారు.

English summary
Has India ushered in the third wave of Covid-19? According to a top city researcher, who has analysed the metrics of infection and death rate for over 15 months based on daily covid data, the third wave appears to have set in on July 4 to be precise. Dr Vipin Srivastava, an eminent physicist and former pro-vice-chancellor, University of Hyderabad (UoH), told that the pattern of new Covid-19 infections and deaths in the country since July 4 appeared similar to that of the first week of February 2021, when the second wave of Covid-19 hit the country peaking by April end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X