తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే: ఆ జిల్లాల్లో జల ప్రళయం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల భారీ వర్షాలు, వరదలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగామ, మంచిర్యాల, హన్మకొండ, వరంగల్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలకూ భారీ వర్ష సూచన చేశారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ కేంద్రం అంచనాలకు అనుగుణంగా తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

This village in Kamareddy records highest ever rainfall

27 ఉదయం 8:30 గంటల నుంచి 28వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు రికార్డయిన అత్యధిక వర్షపాతం వివరాలను భారత వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసింది. కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాజంపేట మండలం అర్గొండలో 431.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని అక్కాపూర్‌లో 323.3, మెదక్ జిల్లా హవేలిఘనపూర్‌లోని సర్దానాలో 305.3, కామారెడ్డి టౌన్ ఐడీఓసీ వద్ద 289.0, నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్డ్యాల్‌లో 279.3, కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో 279.0 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

మెదక్ జిల్లా హవేలిఘనపూర్‌లోని నాగపూర్‌లో 276.5, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 275.8, కామారెడ్డి పాత రాజంపేటలో 247.3, నిర్మల్ జిల్లా విశ్వనాథపేటలో 241, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని ముజిగిలో 231.5, మెదక్ జిల్లా చేగుంటలో 227.8 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది.

కామారెడ్డి జిల్లా లింగంపేటలో 222.0, మెదక్ జిల్లా రామాయంపేటలో 206.0, మెదక్ ఆర్‌డీఓ కార్యాలయం వద్ద 205.8, కామారెడ్డి జిల్లా దోమకొండలో 202.0, మెదక్ జిల్లా రాజ్‌పల్లిలో 193.5, కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలోని లాచాపెట్‌లో 190.0, కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో 185.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

సిద్దిపేట జిల్లా కొండపాకలో 184.8, కామారెడ్డి జిల్లా పల్వంచలోని ఏలుపుగొండలో 180.8, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని కొడకండ్లలో 178.8, కుమరం భీమ్ జిల్లా రెబ్బెనలో 177.8, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 175.3, నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లోని జామిలో 174.3 మిల్లీ మీటర్ల వర్షం పడింది.

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 173.5, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 173.3, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోని హసన్‌పల్లిలో 170.5, నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పక్‌పట్లలో 170.3, నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో 170.0 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+