విజయశాంతి దంపతులకు బెదిరింపు మెసేజ్‌లు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) దంపతులకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి బెదిరింపు సందేశం పంపాడని, బకాయిలు తీర్చకుంటే మీరే శత్రువులు అవుతారని మెసేజ్ చేశాడని విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమోదయోగ్యంకాని రీతిలో మెసేజ్‌లు ఉన్నాయని, అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు బెదిరింపులకు పాల్పడిన చంద్రశేఖర్ రెడ్డిపై బీఎన్ఎస్ యాక్ట్ 35(12), 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నాలుగేళ్ల క్రితం చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తమను సంప్రదించినట్లు విజయశాంతి భర్త తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా పరిచయం చేసుకున్నాడని, విజయశాంతి వద్ద సోషల్ మీడియా హ్యాండ్లర్‌గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, చంద్రశేఖర్ రెడ్డి తమతో కలిసి పనిచేస్తూనే సొంత వ్యాపారాన్ని బలపరుచుకున్నాడని, స్వలబ్ధి కోసం తమ పేరును వాడుకున్నాడని చెప్పారు. పనితీరు నచ్చకపోవడంతోనే చంద్రకిరణ్ సేవలను ఉపయోగించుకోలేదని శ్రీనివాస ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము బీజేపీలో ఉన్నప్పుడు చంద్రకిరణ్‌తో పరిచయం ఏర్పడిందని.. బీజేపీలో ఎదిగేందుకు అతను తమను వాడుకున్నట్లు విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ తెలిపారు.
బీజేపీ నుంచి బయటికి వచ్చాక చంద్రకిరణ్ రెడ్డి నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా? అని చంద్రకిరణ్ ఏప్రిల్ 06వ తేదీన మెసేజ్ పంపాడని.. దానికి బదులుగా తాము బకాయిలు ఏమీ లేవని సమాధానమిచ్చినట్లు శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పారు.












Click it and Unblock the Notifications