ఇద్దరు బాలికలపై అత్యాచారం, బాలుడిపై లైంగిక వేధింపులు
వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో బాలుడిపై లైంగిక వేధింపులకు దిగాడు. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
వనపర్తి: ట్యూషన్‌కు వెళుతున్న ముగ్గురు చిన్నారులకు చాక్లెట్ ఆశచూపి ఓ వ్యక్తి ఇద్దరు బాలికలపై అత్యాచారానికి, ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల్లో ఇద్దరు ఎనిమిదేళ్ల బాలికలు, మరొకరు అదే వయసున్న బాలుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
నిందితుడిని గ్రామస్థులు చితకబాది పోలీసులకు అప్పగించారు. మదనాపురం మండలంలోని గోవిందహళ్లి గ్రామానికి చెందిన 8 సంవత్సరాల ఇద్దరు బాలికలపై అదే గ్రామానికి చెందిన దాసరి శేఖర్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండురోజులుగా ఆ ఇద్దరు చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.

దాంతో వారి తల్లిదండ్రులు ఎందుకు వెళ్లరంటూ అరా తీశారు. దీంతో జరిగిన సంఘటన ఆ తల్లిదండ్రులకు వివరించారు. అదే గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న బాలుడినికూడా లైంగికంగా వేధించినట్లు తెలిసింది. ఈ ముగ్గురు చిన్నారులు ట్యూషన్‌కు వెడుతుండగా వారికి చాకెట్ల ఆశచూపి ఇంట్లోకి పిలిచిన శేఖర్ ఆ తరువాత అత్యాచారానికి పాల్పడిననట్లు డిఎస్‌పి చెన్నయ్య వివరించారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు శేఖర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. అతనిపై పోకస్ యాక్టుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అత్యాచారానికి గురైన చిన్నారులను వైద్య పరీక్షలు నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ ఆదిత్య తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications