మిత్రుడి తండ్రి అంత్యక్రియలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు...
నల్లగొండ: మిత్రుడి తండ్రి అంత్యక్రియలకు హాజరై వస్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మరణించారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా మునగాల మండల పరిధిలోని మాధవరం శివారులో జరిగింది.
హైదరాబాద్‌కు చెందిన ఎస్కే ముబీన్, బీవీ శ్రీహర్షరెడ్డి, పాశంకంటి మంజునాథ్ (హన్మకొండ) రమ్య, లక్ష్మారెడ్డి ఒక వాహనంలో మరికొందరు మరో వాహనంలో కలిసి స్నేహితుడైన జితిన్ తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బుధవారం హైదరాబాద్ నుంచి రెండు కార్లలో విశాఖపట్నం వెళ్లారు.

అంత్యక్రియల్లో పాల్గొని గురువారం తిరుగుప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ముబీన్ బృందం ప్రయాణిస్తున్న స్కోడా కారు మునగాల మండలం మాధవరం శివారు వద్ద రోడ్డు పక్కన కల్వర్టులోకి దూసుకెళ్లింది.
ప్రమాదంలో ఎస్కే ముబీన్ (19), బీవీ శ్రీహర్షరెడ్డి (18), పాశంకంటి మంజునాథ్(17) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. రమ్య, లక్ష్మారెడ్డిని 108 అంబులెన్స్‌లో సూర్యాపేట దవాఖానకు తరలించారు. మృతదేహాలు కారులో ఇరుక్కొని ఉండడంతో స్థానికుల సహకారంతో పోలీసులు బయటకు తీశారు. ముబీన్ తండ్రి అస్లాం ఫిర్యాదు మేరకు సీఐ మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాహుల్‌దేవ్ తెలిపారు.












Click it and Unblock the Notifications