బేగంపేట్, చందానగర్, కోకాపేట్: భాగ్యనగరాన్ని చుట్టుముట్టిన కరోనా: మరో మూడు పాజిటివ్ కేసులు
హైదరాబాద్: కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, దాని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. పాజిటివ్ కేసుల సంఖ్యకు అడ్డుకట్ట పడట్లేదు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ. కట్టుదిట్టమైన నిషేధాజ్ఙలు అమలు చేసినప్పటికీ.. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉంది. తాజాగా తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది.

బేగంపేట్, చందానగర్, కోకాపేట్‌లల్లో..
తాజాగా హైదరాబాద్ నగర శివార్లలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేట్, శివార్లలోని కోకాపేట్, చందానగర్‌లల్లో ఈ మూడు కేసులు కూడా కొత్తగా నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం తాజాగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ ముగ్గురూ విదేశాల నుంచి వచ్చిన వారే.

లండన్ నుంచి వచ్చిన వ్యక్తిలో..
రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో నివసించే 49 సంవత్సరాల వ్యక్తిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వెంటనే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చేర్చారు. కొద్దిరోజుల కిందటే ఆ వ్యక్తి లండన్ నుంచి కోకాపేట్‌కు వచ్చినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. నాలుగు రోజుల కిందటే అతను కోకాపేట్‌కు వచ్చాడని, అనంతరం జ్వరం, దగ్గుతో బాధపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనితో పాటు కుటుంబ సభ్యులను కూడా పరీక్షలను నిర్వహించారు.

జర్మనీ నుంచి వచ్చని మహిళలో..
నగర శివార్లలోని చందానగర్‌లో నివసించే 39 సంవత్సరాల మహిళలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. చాలాకాలంగా ఆమె జర్మనీలో నివసించారు. కొద్దిరోజుల కిందటే జర్మనీ నుంచి చందానగర్‌కు వచ్చారు. ఆ వెంటనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లు రక్త పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు అధికారులు నిర్ధారించారు. వెంటనే ఆమెను ఐసొలేషన్ వార్డుకు తరలించారు.

సౌదీ అరేబియా నుంచి వచ్చిన వృద్ధురాలిలో..
హైదరాబాద్ బేగంపేట్‌లో నివసించే 61 సంవత్సరాలు ఉన్న ఓ వృద్ధురాలు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు. జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఆమె కొద్దిరోజుల కిందటే అక్కడి నుంచి నగరానికి తిరిగి వచ్చారు. కొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించగా.. వైరస్ సోకినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఒకేరోజు మూడు కేసులు నమోదు కావడం తెలంగాణ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications