వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్ నుండి వచ్చాడని కిడ్నాప్ చేశారు, డబ్బులు డిమాండ్ చేసి దొరికారు

డబ్బులున్నాయనే కారణంగా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డిమాండ్ చేశారు. బలవంతంగా అడవుల్లోకి తీసుకెళ్ళి ఐదు లక్షలు డిమాండ్ చేశారు. 59 వేలు మాత్రమే కిడ్రాపర్లకు ఇచ్చాడు. అయితే ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో

|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్ :దుబాయ్ నుండి వచ్చాడని ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఐదు లక్షలు వసూలు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకంది. నిందితులను పోలీసులు అరెస్టుచేశారు.

గార్ల మండలంలోని సత్యనారాయపురం గ్రామానికి చెందిన వెనిగళ్ళ శివ మూడేళ్ళుగా దుబాయ్‌లో ఓ ప్రైవ్‌ే కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి పెళ్లి నిశ్చయం కాగా రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. దుబాయ్‌ నుంచి వచ్చిన అతడి వద్ద డబ్బులు బాగా ఉంాయని అదే గ్రామానికి చెందిన చెరుకూరి సతీష్‌, నవిలి సురేష్‌, గుండా నరేష్‌ భావించారు. ముగ్గురు కలిసి అతడిని కిడ్నాప్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

three kidnapers arrested in mahaboobabad district

ఈ ఏడాది అక్టోబర్‌ 20న రాత్రి ఇంి ఆవరణలో ఉన్న శివను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని బయ్యారం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. తమకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చితకబాదారు. తన వద్ద రూ. 59 వేలు మాత్రమే ఉన్నాయని శివ చెప్పడంతో వదిలిప్టోరు. మరుసలి రోజు రూ. 59 వేలు నగదు వారికి ఇచ్చాడు.

అయితే పెళ్లి ఆగిపోతుందని అతడు ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. కాగా కిడ్నాపర్లు ఇంతితో ఆగకుండా మరికొన్ని డబ్బులు కావాలంటూ బెదిరిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముగ్గురు కిడ్నాపర్లను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ. 10వేలు నగదు రికవరీ చేసి, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుల అరెస్ట్‌లో చురుగ్గా వ్యవహరించిన కానిస్టేబుల్‌ శ్రీధర్‌, హోంగార్డు మధురెడ్డిని ఎస్‌ఐ. సీహెచ్‌. వంశీధర్‌ ప్రశంసించారు.

దుబాయ్ నుండి వచ్చాడని ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఐదు లక్షలు వసూలు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకంది. నిందితులను పోలీసులు అరెస్టుచేశారు.

English summary
police arrested three kidnapers in mahaboobabad district on thursday, they kidnap shiva for money, shiva working at dubai, he came back dubai for marrage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X