Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T BJP సీఎం అభ్యర్ది ఖరారు - అమిత్ షా ప్రకటన వెనుక..!?

తెలంగాణ బీజేపీ కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. బీఆర్ఎస్ -కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే వ్యూహం తెర మీదకు తెచ్చింది. తాము అధికారంలోకి వస్తే బీసీ నేత సీఎం అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించాయి. అగ్రవర్ణాలకే పెద్దపీట వేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీసీ నినాదం గేమ్ మారుస్తుందనే అంచనాలతో కనిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నుంచి బీసీ సీఎం ఎవరనే చర్చ మొదలైంది.

బీజేపీ బీసీ మంత్ర: బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సీఎం అభ్యర్దిగా రేసులో ఉన్నారు. కాంగ్రెస్ లో సీఎం ఎవరనేది హైకమాండ్ ఖరారు చేయాల్సి ఉంది. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాతనే నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలోనే బీజేపీ కొత్త ఎత్తుగడ వేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు సామాజికంగా చెక్ పెట్టేలా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా బీసీ మంత్ర తెర మీదకు తెచ్చింది. కేంద్రంలో బీసీ ప్రధాని అయ్యారు. 20 మంది బీసీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారని కమలం నేతలు ప్రచారం చేస్తున్నారు.

Mainly Three leaders in BJP in Telangana who are nurturing their ambitions to become CM after Shah Announcement

ఈ క్రమంలో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగానే.. తెలంగాణలో బీజేపీ బీసీ కార్డ్‌ ప్రయోగించింది. బీసీలకు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లను కొల్లగొట్టేందుకు అమిత్‌షా బీసీ సీఎం ప్రకటన చేసారు. దీంతో..బీజేపీలో సీఎం అయ్యే అవకాశం ఉన్న బీసీ నేత ఎవరనే పేర్లు చర్చకు వస్తున్నాయి.

ఎన్నికల్లో బలం పెంచుతుందా: ప్రస్తుతం బీజేపీలో బలమైన బీసీ నేతలుగా కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు సీఎం అవుతారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో బండి సంజయ అధ్యక్షుడుగా ఉన్న సమయం..ఆ ముందు..ఆ తరువాత అన్నట్లుగా పార్టీ కేడర్ లో చర్చ ఉంది. ఎన్నికలకు పార్టీని సిద్దం చేస్తున్న వేళ బండిని తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఒక్కసారిగా పార్టీ లో అనిశ్చిత మొదలైంది.

కేసీఆర్ ను బండి ఢీ కొట్టే నేతగా గుర్తింపు పొందారు. ప్రధాని మోదీతో సహా పార్టీ అగ్రనాయకత్వం సైతం బండి సమర్ధత పైన విశ్వాసం ఉంచింది. సంజయ్‌ దూకుడు చూసి.. ఈసారి తెలంగాణలో బీజేపీదే అధికారం అనే స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అయ్యింది.బండి మార్పు నిర్ణయం తరువాత పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. దీంతో, బండి సంజయ్ ఈ రేసులో తొలి స్థానంలో ఉన్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది.

Mainly Three leaders in BJP in Telangana who are nurturing their ambitions to become CM after Shah Announcement

ముగ్గురు నేతల మధ్య పోటీ: కేసీఆర్‌పై ఆగ్రహంతో బీజేపీలో చేరిన ఈటల.. కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. అంతేకాదు.. వచ్చే నెలలో జరుగన్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక బీజేపీలోనూ మంచి పట్టు సాధించారు ఈటల. ఆయనకు బీజేపీ అధిష్టానం.. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది.

2004 నుంచి జరిగిన వరుస ఎన్నికల్లో గెలవటం..మంత్రిగా పని చేసిన అనుభవం ఈటలకు కలిసొచ్చే అంశాలు.బీజేపీ సీనియర్‌ నాయకుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. అయితే, బీసీ కార్డుతో పాటుగా పార్టీ వ్యూహాలు..నాయకత్వం..మేనిఫెస్టో..ఎన్నికల నిర్వహణ గెలుపుకు కీలకం కానున్నాయి. పార్టీ అదికారంలోకి రాదనే తెలిసి ఇలాంటి నినాదాలతో ఎన్నికల్లోకి బీజేపీ దిగుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మరి..బీజేపీకి కాలం కలిసి వస్తుందా లేదా చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+