Crime News: ప్రియుడితో కలిసి భార్య.. ప్రియురాలితో కలిసి భర్త.. వివాహేతరసంబంధానికి ముగ్గురు బలి..
కలిసుండాల్సిన భార్య, భర్త బంధాలను వివాహేతర సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రాణాలు తీయడమో.. ప్రాణం తీసుకోవడమో చేసేలా చేస్తున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురానికి చెందిన అశోక్ కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మహిళతో వివాహేతర సంబంధం
అశోక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అశోక్ కు వరుసకు వదిన అయిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం అశోక్ భార్యకు తెలియడంతో గొడవలు జరిగాయి. పంచాయతీ కూడా పెట్టింది. పెద్దలు అశోక్ తో పాటు ఆ మహిళను హెచ్చరించారు. కొన్ని రోజులు బాగానే ఉన్న అశోక్ తర్వాత ఆ మహిళతో మళ్లీ సంబంధం కొనసాగించాడు.

ఆత్మహత్య
దీంతో అశోక్ భార్య పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. అయితే ఆ మహిళ ఉన్నట్టుండి మంగళవారం అశోక్ ఇంటికి వెళ్లింది. అదే రోజు వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. త దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మందలింపు
మరో ఘటనలో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది. వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన గోడ్డె బసవయ్య, సుజాత దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. సుజాతకు అదే గ్రామానికి చెందిన బాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు.

విచారణ
దీంతో అడ్డుగా ఉన్న భర్తను సుజాత, ప్రియుడు బాబుతో కలిసి హత్య చేసింది. బసవయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతని బావమరిది లాలయ్య పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications