తెలుగు రాష్ట్రాల్లో ఆగని అత్యాచారాలు.. మూడు కేసుల నమోదు...
మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా...మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా... మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీతో పాటు తెలంగాణలో సైతం పలు అత్యాచారాలకు పాల్పడ్డ కేసులు నమోదు అయ్యాయి. విచిత్రం ఏమిటంటే ఏపీలో మహిళలలపై అత్యాచారాలు చేసిన వారిపై కఠినంగా చర్చించేందుకు దిశ చట్టానికి సవణలు తెచ్చి అసెంబ్లీలో పెట్టి ఆమోదించిన రోజే... ఏపీలో రెండు, హైదరాబాద్‌లో ఒక అత్యాచార కేసు నమోదు అయ్యాయి.

అత్తపై అల్లుడు అత్యాచారం
హైదరాబాద్ నడిబొడ్డున మరో దారుణం జరిగింది. పంజాగుట్ట ప్రాంతంలో అత్తపై అల్లుడు అత్యాచారం చేశాడు. మత్తు మందు ఇచ్చి.. ఆమె నిద్రలో ఉన్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిద్ర నుంచి మేల్కొన్న బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరులో చిన్నారీపై యువకుడి అత్యాచారం
గుంటూరు జిల్లాలోని లక్ష్మారెడ్డి అనే ఇంటర్‌చదువుకున్న ఓ యువకుడు తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ చిన్నారీపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని ఇంట్లోవారికి కూడ చెప్పవద్దని హెచ్చరించాడు. అయితే తరచు చురుకుగా ఉండే చిన్నారీ అనారోగ్యంగా కనిపించడంతో ఆమె కుటుంబసభ్యులు ఆరా తీశారు. దీంతో ఈ విషయం ఎవరికి చెప్పవద్దని అన్నయ్య చెప్పాడని.. అదే సమాధానాన్ని తల్లిదండ్రులకు వివరించింది. అనంతరం జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

క్రిష్ణాలో తల్లి సాక్షిగా మైనర్‌పై అఘాయిత్యం
మరోవైపు కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై 56 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. కంచికచర్ల మండలం పరిటాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునేలా.. తల్లి తన మైనర్ కూతుర్ని బలవంతంగా తన ప్రియుడు వద్దకు పంపించింది. తంగిరాల రాంబాబు అనే వ్యక్తి బాలిక తల్లి సాక్షిగా ఒక రాత్రంతా నరకం చూపించాడు. తండ్రి చనిపోవడంతో 14 ఏళ్ల ఆ బాధితురాలు నానమ్మ దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్పింది. బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications