నైజీరియన్లతో కలిసి ముంబై యువతి 35లక్షల టోపీ
హైదరాబాద్: లాటరీ ఫ్రాడ్ కేసులో ముగ్గురు నైజీరియన్లు, ఓ ముంబైకి చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మీరు రూ. 6కోట్లు లాటరీ గెలుచుకున్నారని, ఈ మొత్తం దక్కాలంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయాలని ఈ-మెయిల్ ద్వారా గాలం వేసి 35 లక్షల రూపాయలు వసూలు చేసిన ఓ నైజీరియన్ ముఠా గుట్టురట్టయింది.
ముఠా సభ్యులు పీటర్, ఎబోహోన్ , ముంబయికి చెందిన మహిళ స్ట్ఫె ఎబోహోన్, ఉజోనిచా డేనియల్ ఇవెన్‌వాన్నేలను పోలీసులు జైలుకు పంపించారు. వారి నుంచి నాలుగు లక్షల నగదు, నాలుగు లక్షల విలువ చేసే కారు, నాలుగు లక్షల నగదున్న రెండు బ్యాంకు అకౌంట్లు, రెండున్నర లక్షల విలువ చేసే గృహోపకరణాలతోపాటు ఆరు సెల్ ఫోన్లు, రెండు డేటా కార్డ్‌లను సీజ్ చేశారు.
సీసీఎస్ డిసిడి, డిడి పాలరాజు తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన చెందిన ముగ్గురు, ముంబైకి చెందిన మహిళతో కలిసి గత కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. త్వరగా డబ్బులు సంపాదించేందుకు ఆన్‌లైన్ మోసాలకు ఒడిగట్టారు.

అనుకున్నదే తడవుగా లాటరీలో ఆరు కోట్ల రూపాయల భారతీయ కరెన్సీ గెలుచుకున్నారని ఈ మెయిల్స్ ద్వారా గాలం వేశారు. నలుగురి నిందితులు పలు దఫాలుగా ఫోన్లు చేసి ఎట్టకేలకు బాధితుడ్ని నమ్మించారు. బాధితుడు నమ్మడంతో అతడి వద్ద నుంచి రిజిస్ట్రేషన్ వంటి తదితర ఛార్జీల కింద పలు దఫాలుగా రూ.35 లక్షలు వసూలు చేశారు.
నకిలీ ఆధారాలతో తెరిచిన గుజరాత్, రాజస్థాన్, ముంబై రాష్ట్రాల్లోని వివిధ బ్యాంకులకు చెందిన 16 ఖాతాల ద్వారా నిందితులు ఆ డబ్బును వసూలు చేశారు. ఆపై ముఠా సభ్యులు ముఖం చాటేయంతో బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు.












Click it and Unblock the Notifications