Road Accident: ఆటోను ఢీకొట్టిన కారు.. కారుపై పడిన జేసీబీ.. ముగ్గురు మృతి..
తెలంగాణలో జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. హనుమకొండ జిల్లా పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిలో ఆటోను కారు ఢీకొట్టింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు వేగంగా ఢీకొట్టడంతో కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కూలీలు పత్తిపాక నుంచి పోచంపల్లికి మిర్చి ఎరడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అటు నిజమాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు మృతి చెందారు. జిల్లాలోని భీంగల్ లో కారుపై జేసీబీ పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరున్న పోలీసులు కారులో చిక్కుకున్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మృతులు మోర్తాడ్ కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జేసీబీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామారం గ్రామంలో కారుపోతుల సోమన్న గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశత్తు కిందికి జారాడు. అతను తాటి చెట్టుపై వేలాడుతుండగా గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే జేసీపీ సహాయంతో సోమన్నను కాపాడారు.












Click it and Unblock the Notifications