తుమ్మల & పొంగులేటి: ఖమ్మంలో రాజకీయ కాక

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యంపై జోరుగా చర్చ నడుస్తోంది. కొత్త సంవత్సరంలో తమ సత్తా చాటేందుకు వీరిద్దరూ విందు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం రూరల్ లో గృహప్రవేశం సందర్భంగా తుమ్మల విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తుమ్మల అభిమానులు, నాయకుల ఆత్మీయ కలయిక పేరుతో ఇది జరిగింది.

తుమ్మల పోటీచేయాలంటూ డిమాండ్

తుమ్మల పోటీచేయాలంటూ డిమాండ్


గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నియోజకవర్గ పరిధిలోకి ఈ గృహప్రవేశ కార్యక్రమం వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నాయకులు భారీగా తరలివచ్చారు. భవిష్యత్తులో తామంతా తుమ్మల వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు చేసిన అవిరళ కృషిపై 10వేల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. పాలేరు నుంచి మళ్లీ పోటీచేయాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో తాను పోటీచేయడం ఖాయమని ప్రకటిస్తున్నారు.

పొంగులేటి ఆత్మీయ విందు

పొంగులేటి ఆత్మీయ విందు

మరో వైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అభిమానులు, కార్యకర్తల కోసం తన నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తరలివచ్చిన నాయకులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అందరి మనసులో ఏముందో తనకు తెలుసని, అందరూ కాస్తంత ఓపిక పట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనతోపాటు తన అనుచరులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

వేడెక్కిన ఖమ్మం రాజకీయం

వేడెక్కిన ఖమ్మం రాజకీయం

గత ఎన్నికల సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నామా ఘనవిజయం సాధించారు. అప్పటి నుంచి పొంగులేటికి సరైన ప్రాతినిధ్యం దక్కడంలేదంటూ ఆయన అనుచరులు కినుక వహించారు. పొంగులేటి పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా రానున్న ఎన్నికల్లో పోటీచేయబోతున్నానంటూ ప్రకటించడంతో ఇక్కడి రాజకీయం వేడెక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+