రేవంత్ వర్సస్ కేసీఆర్, లోక్ సభలో ఎవరికెన్ని సీట్లు - జాతీయ సర్వే సంచలనం..!!
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువు తీరింది. అప్పుడే ప్రభుత్వం పైన బీఆర్ఎస్ అస్త్రాలు సిద్దం చేస్తోంది. పాలనా పరంగా రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలు రేవంత్ సమర్థకు పరీక్షగా మారుతున్నాయి. అటు కేసీఆర్ ఓడినా..ప్రజల్లో ఆదరణ తగ్గలేదనేది బీఆర్ఎస్ అంచనా. ఈ సమయంలోనే ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ప్రముఖ జాతీయ సర్వే వెల్లడించింది.
ఎవరికి ఎన్ని సీట్లు : తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. పట్టు కొనసాగించేందుకు కాంగ్రెస్..తిరిగి తమ హవా కొనసాగాలంటే బీఆర్ఎస్..తమ సత్తా చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో ప్రముఖ జాతీయ సంస్థ టైమ్స్ నౌ- ఈటీజీ సంస్థ లోక్ సభ ఎన్నికల పైన సర్వే అంచనాలను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ సంస్థ వెల్లడించిన అంచనాలు దాదాపు వాస్తవం అయ్యాయి. ఇప్పుడు ఈ సంస్థ అంచనాలు..వెల్లడించిన ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

సర్వే ఫలితాలు ఇలా : టైమ్స్ నౌ- ఈటీజీ సంస్థ సర్వే అంచనాల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ 8-10 స్థానాలు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. అదే విధంగా బీఆర్ఎస్ 3-5 స్థానాలు దక్కించుకునే ఛాన్స్ ఉందని విశ్లేషించింది. బీజేపీ 3-5 స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఇతరులు ఒక స్థానం గెలుచుకుంటారని వెల్లడించింది. దీని ద్వారా కాంగ్రెస్ ఈ సారి తెలంగాణలో మెజార్టీ లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని వివరించింది. బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లోనూ పుంజుకొనే అవకాశం లేదని విశ్లేషించింది. అయితే, ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందని..రేవంత్ పాలనా పరంగా తీసుకొనే నిర్ణయాలు ఆ పార్టీకి ఓట్లుగా మలచటంలో కీలకం కానుంది విశ్లేషకుల అభిప్రాయం.
TIMES NOW - @ETG_Research Survey
— TIMES NOW (@TimesNow) December 13, 2023
Telangana Total Seats: 17
Who will win how many seats in Lok Sabha if elections were to be held today?
BRS: 3-5
BJP: 3-5
Cong: 8-10
Others: 0-1
We (Cong) are confident of securing between 10-15 seats in the LS elections - @ShujathAliSufi… pic.twitter.com/HDhdHirvq1
మారుతున్న లెక్కలు : కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడు రేవంత్ పైనే భారం మోపింది. లోక్ సభ ఎన్నికల వరకు రేవంత్ నే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని భావిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ అలర్ట్ అవుతున్నారు. ఆరోగ్య పరంగా పూర్తిగా కోలుకున్న తరువాత ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. అటు బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోవటంతో పాటుగా ఓట్ షేర్ పెంచుకుంది. లోక్ సభ ఎన్నికలు ప్రధానంగా జాతీయ స్థాయి అంశాల ఆధారంగా జరిగే అవకాశం ఉండటంతో...మోదీ ఛరిష్మా తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తుంది. దీంతో..ఇప్పుడు ఈ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications