TTD: భక్తుల చెంతకే శ్రీవారి లడ్డూ - ఈ ఆలయాల్లో విక్రయాలు..!!
తిరుమల శ్రీవారి లడ్డును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమలలో తాజాగా లడ్డూ ప్రసాదం పంపిణీలోనూ కీలక మార్పులు చేసారు. దర్శనం చేసుకున్న వారికి ఎన్ని లడ్డూలు అయినా అందుబాటులో ఉంచుకున్నారు. దర్శనం చేసుకోని వారు మాత్రం ఆధార్ కార్డు చూపించి లడ్డూ ప్రసాదం పొందేలా మర్పు చేసారు. ఇదే సమయంలో టీటీడీ ఆలయాలతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ శ్రీవారి ప్రసాదం లడ్డూలను విక్రయించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో శ్రీవారి భక్తులకు లడ్డూను అందుబాటులోకి తెచ్చేలా.. తిరుమల తిరుపతి దేవస్థానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు వారంలో ఒకరోజే అందుబాటులో ఉండే తిరుపతి లడ్డూ ఇకపై అన్ని రోజులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇక నుంచి ప్రతిరోజూ హైదరాబాద్నగర భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు(టీటీడీ)లో రూ.50కే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది.

ఇప్పటివరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది. అదే విధంగా.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి లోని కోదండరామ స్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, అప్పలయాగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట లోని కోదండరామ స్వామి ఆలయం, దేవుని కడప ఆలయాల్లోనూ అందుబాటులో ఉంచతున్నారు.
వీటితో పాటుగా విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, అమరావతి,రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో లడ్డూలు విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్వామివారి ప్రసాదం భక్తులకు మరింత చేరవ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications