టీఎస్ఆర్టీసీలో తిరుమలకు వెళితే శ్రీవారి శీఘ్రదర్శనం: ఇంటికే భద్రాద్రి రాముడి తలంబ్రాలు
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు అందిస్తోన్న ముఖ్యమైన సేవలను వినియోగించుకవోాలని టీఎస్ఆర్టీసీ మరోసారి కోరింది.
హైదరాబాద్: తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు అందిస్తోన్న ముఖ్యమైన సేవలను వినియోగించుకవోాలని టీఎస్ఆర్టీసీ మరోసారి కోరింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సులు నడుపుతోందని.. ఈ బస్సుల్లో ప్రయాణించేవారు.. తిరుమల శ్రీవారిని సులభంగా, శీఘ్రంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని తెలిపారు సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్.

టీఎస్ఆర్టీసీలో తిరుమలకు వెళితే.. శీఘ్రదర్శనం
ప్రతిరోజు 1000 మంది ప్రయాణికులకు రూ. 300 శీఘ్ర దర్శన టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. దీనిని భక్తులు వినియోగించుకోలన్నారు. మార్చి 18 వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన 1,14,565 మంది ప్రయాణికులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించిందని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ, సాధారణంగా వెళ్లేవారికి దర్శనానికి పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లాలని తెలిపారు. దీంతో శ్రీవారి దర్శనం త్వరగా అవుతుందని చెప్పారు.

టీఎస్ఆర్టీసీ ద్వారా వారంలోనే తిరుమల శ్రీవారి దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెబ్‌సైట్ ద్వారా రూ. 300 టికెట్‌తో దర్శనం చేసుకోవాలంటే నెల రోజులపాటు వేచి ఉండాల్సి వస్తోందని.. అదే టీఎస్ఆర్టీసీ ద్వారా అయితే వారం రోజులు చాలని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన బస్సుల్ని తిరుపతికి నడిపిస్తున్నట్లు చెప్పారు. తిరుమల వెళ్లే భక్తులు.. మరిన్ని వివరాల కోసం టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్ https://www.tsrtconline.in ను సంప్రదించాలని సూచించారు.

టీఎస్ఆర్టీసీ ద్వారా ఇంటికే భద్రాద్రి రాములోరి తలంభ్రాలు
ఇది ఇలావుండగా, శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ. 116 చెల్లించి.. వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. అంతేగాక, ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీర్టీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020లలో సంప్రదించాలని పేర్కొంది. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
భక్తుల వద్ద కూడా ఆర్డర్లను స్వీకరిస్తారని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.
-
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు












Click it and Unblock the Notifications