వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్: ఓకె చెప్పిన బిజెపి, కెసిఆర్ కు చెక్ పెట్టేనా?

:టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ మంగళవారం నాడు సాయంత్రం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో సమావేశమయ్యారు. ఈ నెల 7వ, తేదిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన నేపథ్యంలో కోదండరామ్ లక్ష్మణ్ తో సమావేశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ మంగళవారం నాడు సాయంత్రం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో సమావేశమయ్యారు. ఈ నెల 7వ, తేదిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన నేపథ్యంలో కోదండరామ్ లక్ష్మణ్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తే తాము మద్దతిస్తామని లక్ష్మణ్ హమీ ఇచ్చారు.

టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ కొంతకాలంగా టిఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆయన ఒంటికాలిపై లేస్తున్నారు.

బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడ ఇటీవల కాలంలో అధికార టిఆర్ఎస్ పై దూకుడును పెంచింది.అయితే తెలంగాణలో బలపడాలని బిజెపి జాతీయ నాయకత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది.

ఈ మేరకు ఈ నెల 7వ, తేదిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైద్రాబాద్ లో పర్యటించనున్నారు.పార్టీ నాయకులతో తెలంగాణలో బలపడే విషయమై వ్యూహరచన చేయనున్నారు.

ఈ తరుణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కోదండరామ్ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరిమధ్య చర్చ జరిగినట్టు సమాచారం.

ఐక్యపోరాటాలకు సన్నద్దం

ఐక్యపోరాటాలకు సన్నద్దం

టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కలిసివచ్చే శక్తులకు కలుపుకుపోయేందుకుగాను టీజెఎసి ప్లాన్ చేస్తోంది. ధర్నా చౌక్ తో పాటు ఇతర అంశాలపై తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి పోరాటాన్ని నిర్వహించాలని జెఎసి భావిస్తోంది.ఈ మేరకు బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ తో కోదండరామ్ చర్చించారని సమాచారం.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకొనిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

టిఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు

టిఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు

బాగ్ లింగంపల్లిలోని ఓ ఇంట్లో వీరిద్దరూ సమావేశమయ్యారు.ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. వీరితో పాటు గాదె ఇన్నయ్య, ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడ ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ కూడ టిఆర్ఎస్ విధానాలను నిరసిస్తూ పోరాటం చేసేందుకు రడీ అని ప్రకటించింది. తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో పోరాటాలు చేస్తామని ప్రకటించింది.

టిఆర్ఎస్ తీరును ఎండగట్టే వ్యూహం

టిఆర్ఎస్ తీరును ఎండగట్టే వ్యూహం

టిఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహన్ని ఎండగట్టేందుకు టిజెఎసి వ్యూహరచన చేస్తోంది. ధర్నాచౌక్ ను శివార్లకు తరలించడం వంటి సమస్యపై టిఆర్ఎస్ అనుసరిస్తున్న తీరు ఆ పార్టీ అసహనానికి నిదర్శనంగా నిలుస్తోందని జెఎసితో పాటు సమావేశమైన సందర్బంగా నాయకులు అభిప్రాయపడినట్టు సమాచారం.ఏ రకంగా పోరాటాలు నిర్వహించాలనే విషయమై చర్చించారని సమాచారం.

ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ

ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ

టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటాల నిర్వహణకుగాను ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే యోచనపై చర్చించారని తెలుస్తోంది. ప్రజాసంఘాలన్నీ ఫ్రంట్ గా ఏర్పడితో తాము మద్దతిస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారని సమాచారం.ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా తమ పార్టీ వైఖరి ఉన్న విషయాన్ని లక్ష్మణ్ ప్రకటించారు.

English summary
tjac chairmen kodaram met bjp state president met on tuesday evening. both of discussed situation in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X