వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.!వలసలు అభివృద్ధికి మార్గం కావాలన్న ఎన్నారై దేవేందర్ రెడ్డి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మృగ్యంకావడంతో వలసబాట పట్టారు జనం. ఉపాది అవకాశంతో పాటు అధిక వేతనాలు మరింత మెరుగైన జీవనం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం కూడా మరొక కారణం. పల్లెల నుండి పట్టణాలకు గాని, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గాని వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. నేడు అంతర్జాతీయ వలసల దినోత్సవం సందర్బంగా వలదారులందరికి జాతీయ ప్రవాసి కోఆర్డినేటర్ నంగి దేవేందర్ రెడ్డి శుభాకంక్షలు తెలిపారు.

 డిసెంబర్ 18 అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. ప్రవాసీ తెలంగాణ దివస్ ను జరపాలన్న ఎన్నారై దేవేందర్

డిసెంబర్ 18 అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. ప్రవాసీ తెలంగాణ దివస్ ను జరపాలన్న ఎన్నారై దేవేందర్

వలస వెళుతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో "అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ" గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మెరుగైన ఉపాది అవకాశాల కోసం ఎంత స్వేఛ్చా సతంత్ర్వంగా విదేశాలకు వెళ్తున్నారో అంతే స్వేఛ్చగా తిరిగిరావొచ్చని సభ తీర్మాణం చేసింది.

 విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు.. ఎన్నారైల సంక్షేమం చూడాలన్న దేవేందర్

విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు.. ఎన్నారైల సంక్షేమం చూడాలన్న దేవేందర్

ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతున్నదని, ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదని దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండు చాలాకాలంగా అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడున్నర ఏళ్లలో 1500 కు పైగా తెలంగాణ ప్రవాసీయులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారని, గల్ఫ్ మృతుల కుటుంబాలు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కోసం ఎదిరు చూస్తున్నారని, 500 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ తో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చేయాలని దేవేందర్ రెడ్డి కోరుతున్నారు.

 గల్ఫ్ దేవాల్లోని భారతీయులను ఆదుకోవాలి.. తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలన్న దేవేందర్

గల్ఫ్ దేవాల్లోని భారతీయులను ఆదుకోవాలి.. తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలన్న దేవేందర్

38 ఏళ్లనాటి ఎమిగ్రేషన్ యాక్టు, 1983 స్థానంలో నూతన ఎమిగ్రేషన్ యాక్టు, 2021 ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని దేవేందర్ రెడ్డి అన్నారు. ఎన్నారైలకు 'ప్రాగ్జీ' ఓటింగు (ప్రతినిధి ద్వారా, పరోక్ష పద్ధతిలో ఓటు వేయడం) లేదా ఆన్ లైన్ ఓటింగు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న 2,183 మంది భారతీయులు న్యాయ సహాయం కోసం ఎదిరు చూస్తున్నారని అన్నారు. గల్ఫ్ దేశాలలో పనిచేసి భారతీయ కార్మికులకు భారత ప్రభుత్వం కనీస వేతనాలను తగ్గిస్తూ సర్కులర్లను జారీ చేసిందని, అన్నివర్గాల ఒత్తిడితో ఆ తర్వాత ఆ సర్కులర్లను రద్దు చేశారని తెలిపారు.

 హైదరాబాద్ లో విదేశ్ భవన్ నిర్మించాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దేవేందర్ రెడ్డి.

హైదరాబాద్ లో విదేశ్ భవన్ నిర్మించాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దేవేందర్ రెడ్డి.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖవారు ముంబయిలో ఏర్పాటు చేసిన విధంగా "విదేశ్భవన్" ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని దేవేందర్ రెడ్డి డిమాండ్ చేసారు. ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లో పాసు పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసిసిఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచిసెక్రెటేరియట్లు ఉంటాయని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం 'ప్రవాసీ తెలంగాణ దివస్' ను అధికారికంగా నిర్వహించాలిని, విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలంగాణ ప్రవాసి సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వవేదిక ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సినఅవసరం ఉందని బింగి దేవేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

English summary
Moving from one country to another is called international migration. National foreign Coordinator Nangi Devender Reddy congratulated all the migrants on the occasion of International Migration Day today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X