దశాబ్ది ఉత్సవాల్లో నేడు రైతు దినోత్సవం.!వరంగల్ మార్కెట్లో మంత్రి ఎర్రబెల్లి మాటాముచ్చట.!
వరంగల్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్భంగా ఎనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులందరూ తెలంగాణ రాకముందు ఎలా ఉన్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో మీరే బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొంటున్నామని, జూన్ 15 లోపు, అలాగే నవంబర్ 10 లోపు నాట్లు వేసుకుంటే, అకాల వర్షం వల్ల పంట నష్టం అవ్వదని, రైతులు ఈ దిశగా ఆలోచించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర రైతాంగానికి విన్నవించారు.
గతంలో నిత్యం కరెంటు కోతలతో మోటర్లు కాలిపోయేవని, ఐదు గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గతంలో బోర్లు కూడా పడని నేలలో కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాల పెరిగాయన్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. ఒకప్పుడు రెండు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో మూడు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి పెరిగిందన్నారు.

57,801 కోట్ల రూపాయల రైతుబంధు ఇప్పటివరకు అందించామని, 4,339 కోట్ల రూపాయలు రైతు బీమా ఇచ్చామన్నారు మంత్రి ఎర్రబెల్లి. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సీపీ రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి కార్యక్రమంలో పాల్లొన్నారు.












Click it and Unblock the Notifications