వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే రాహుల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ ... ప్రభావం ఉంటుందా ?

|
Google Oneindia TeluguNews

రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ మార్చి 9 శనివారం నిర్వహించబోతున్నారు . ఒక్కరోజు పర్యటన కోసం ఆయన తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తొలి సభ కావడంతో ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేసింది.

కర్ణాటకలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం, బళ్లారిలో చాలెంజ్, కాంగ్రెస్ హంగామా!కర్ణాటకలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం, బళ్లారిలో చాలెంజ్, కాంగ్రెస్ హంగామా!

పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు భారీ ఏర్పాట్లు

ఈరోజు కర్నాటకలో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాహుల్‌ అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు వస్తారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలో కనీస ఆదాయ పథకాన్ని రాహుల్‌ ప్రకటించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 32వేల బూత్‌ స్థాయి కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పహాడీ షరీఫ్‌లో ఉన్న గ్రౌండ్‌లో దాదాపు మూడు లక్షల మందిని జనసమీకరణ చేసేందుకు పీసీసీ కసరత్తు చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల వేళ రాహుల్‌తో నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో... రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Today Rahuls election campaign meeting of the Parliament.. Will be the effect?

లోక్ సభ ఎన్నికల్లో అయినా రాహుల్ గాంధీ ప్రచార ప్రభావం ఉంటుందా ?

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధిస్తామన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్‌... ఎన్నికల ప్రచారం రాహుల్‌తో ఓపెనింగ్‌ చేసి గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్‌ చేసింది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారీగా సమాయత్త సభలతో దూసుకుపోతుంది. గత ఎన్నికల ఫలితాలలాగే ఈ ఎన్నికల్లో 16 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకున్తామనే ధీమాతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేసిన దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. రాహుల్ గాంధీ పడి పడి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.. మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అయినా రాహుల్ ప్రచార ప్రభావం ఉంటుందా అన్నది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చకు కారణమవుతుంది. గత ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు స్వయంగా వచ్చి ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ప్రభావం కనిపించకపోవడంతో ఈ ఎన్నికల్లో అయినా రాహుల్ ప్రచార ప్రభావం ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
Congress president Rahul Gandhi is starting the lok sabha poll campaign from the Chevella constituency in Ranga Reddy district (old) on March 9. The congress leaders taken this meeting as prestigious as it is a starting meeting of parliament elections. TRS working president K.T. Rama Rao has begun holding constituency-wise meetings of party workers. Telangana state Congress leaders are hoping their party will perform better than it did in the recent Assembly elections, but there is a discussion in political parties about Rahul meetings impact and the performance of the congress party in the lok sabha polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X