నటులతోనే సాధ్యం, ఇదీ పోలాండ్ కథ!: విద్యార్థులకు ఆ రాజు గురించి చెప్పిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్/కరీంనగర్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఆదివారం పోలాండ్ రాయబారి ఆడమ్ బురాకోవస్కీ భేటీ అయ్యారు. అంతకుముందు భార్య అన్నా లెజినోవా, పోలాండ్ రాయబారి తదితరులతో కలిసి పవన్ సికింద్రాబాదులోని చర్చిలో ప్రార్థనలు చేసారు. అనంతరం జనసేన కార్యాలయంలో పోలాండ్ ప్రతినిధులతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్‌తో పోలాండ్‌లోని వార్సాలో ఉన్న మహారాజ పాఠశాల, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కూడా ముచ్చటించారు. ఈ సందర్భంగా పోలాండ్‌లో భారతీయతను గుర్తుచేసే మహారాజ పాఠశాల ఉందని దాని గురించి వివరాలను పవన్‌ చెప్పారు.

 మహారాజ చరిత్ర చెప్పిన పవన్ కళ్యాణ్

మహారాజ చరిత్ర చెప్పిన పవన్ కళ్యాణ్

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్‌పై జర్మనీ దాడి చేసిన సమయంలో చాలామంది చిన్నారులు అనాథలయ్యారు. సోవియట్‌ రష్యా వచ్చి ఆ పిల్లల దత్తత గురించి పత్రికల్లో ప్రకటన వచ్చినప్పుడు గుజరాత్‌లోని జాంనగర్‌ మహారాజ దత్తత తీసుకొని వారికి భారత్‌లో ఆశ్రయమిచ్చారు.

 పాఠశాల ఏర్పాటు

పాఠశాల ఏర్పాటు

పిల్లల మాతృసంస్కృతి ప్రకారం చదివించారు. ఇది తెలుసుకున్న పోలాండ్‌ రాజు.. మహారాజ అభ్యర్థన మేరకు వార్సాలో మహారాజ పేరుతో పాఠశాలను ఏర్పాటు చేయించారు. ఆడమ్‌ కూడా ఆ పాఠశాల విద్యార్థేనని పవన్ కళ్యాణ్ తెలిపారు.

 పవన్ కళ్యాణ్‌తో రాజకీయాలు

పవన్ కళ్యాణ్‌తో రాజకీయాలు

విద్యార్థులు పవన్ కళ్యాణ్‌తో భారత రాజకీయాలు, సంస్కృతి తదితర అంశాలపై మాట్లాడారు. భారత్ - పోలాండ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను మహారాజ విద్యార్థిని అని, తనకు హిందీ తెలుసునని, భారత్ అంటే తనకు ఇష్టమని పోలాండ్ రాయబారి చెప్పారు.

 నటులతోనే సాధ్యమని పవన్ కళ్యాణ్

నటులతోనే సాధ్యమని పవన్ కళ్యాణ్

మరోవైపు తెలుగు చిత్రపరిశ్రమ పోలాండ్‌లో సినిమా చిత్రీకరణకు రావాలని పోలాండ్‌ రాయబారి ఆడమ్‌ ఆహ్వానించారు. దీనిపై పవన్‌ కళ్యాణ్ స్పందిస్తూ తన సినిమాలోని కొన్ని సన్నివేశాలు బల్గేరియా ప్రాంతంలో తీశామన్నారు. ప్రాంతాల, దేశాల మధ్య అంతరాన్ని తగ్గించడం నటులతో సాధ్యమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+