జనసేనలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్: తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఇలా
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలోని 26 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు.
తెలంగాణ కోసం 1300 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చకుంటే ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఏ పార్టీలోనూ ఇంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వలేదన్న పవన్ కళ్యాణ్.. జనసేన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జనసేనలోకి బీవీఎస్ఎన్ ప్రసాద్
ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ప్రసాద్ పార్టీ కార్యకర్తగా ఉంటారా? లేక ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనేది వేచి చూడాలి.

కాగా, పవన్ కళ్యాణ్‌తో 'అత్తారింటికి దారేది' చిత్రాన్ిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. వెంకటేశ్వర్ సినీ చిత్ర సంస్థ ద్వారా ఆయన సినిమాలు నిర్మిస్తుంటారు. ఆయన పలు భారీ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.
యాగం చేసిన పవన్ కళ్యాణ్
ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో యాగం ప్రారంభించారు. ఈ యాగాన్ని పవన్ స్వయంగా గణపతి పూజతో అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం 6.55 గంటలకు పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టువస్త్ర ధారణతో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్యర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాగం మంగళవారం కూడా కొనసాగుతుందని జనసేన పార్టీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications