పోలీసు స్టేషన్ కు వచ్చిన మహేష్ బాబు సోదరి - రూ 2.29 కోట్లు మోసపోయాను : ఏం జరిగింది...!!
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పోలీసు స్టేషన్ కు వచ్చారు. తాను కోట్ల రూపాయాలు నష్టపోయానని ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి చీటింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ పేరు చెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కాజేసిన శిల్పా గుట్టును పోలీసులు రట్టు చేసారు. టాలీవుడ్ లోని ముగ్గురు సెలబ్రెటీలను మోసం చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే శిల్పా చౌదరిని అరెస్ట్ చేసారు. శిల్ప బాధితుల్లో చాలామంది ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది.

శిల్ప బాధితుల్లో మహేష్ సోదరి
ఆమె బాధితుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని ఉన్నారు. శిల్పా చౌదరి తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకొని మోసం చేసిందని ప్రియదర్శిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఆమె మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసారు. శిల్పా ప్రతీ వారం కిట్టి పార్టీ అని పిలిచి, తమ వద్ద డబ్బు తీసుకుందని, డబ్బుల కోసమే ఆమె ఆ పార్టీలు ఏర్పాటు చేసేదని, తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులో వివరించారు.

రూ 2.29 కోట్లు నష్టపోయానంటూ ఫిర్యాదు
ప్రియదర్శిని ఫిర్యాదు అందుకున్న పోలీసులు కస్టడీలో ఉన్న శిల్పను మరోసారి విచారించి డబ్బులు ఎక్కడ దాచిందో తెలుసుకుంటామని చెప్పారు. అయితే, శిల్పా బాధితుల్లో మరి కొంత మంది టాలీవుడ్ ప్రముఖులు బాధితులుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే, వారి పేర్లు బయటకు చెప్పటానికి నిరాకరిస్తున్నారు. మరో ముగ్గురు సెలబ్రెటీలు ఇదే విధంగా మోస పోయారని ప్రచారం సాగుతోంది. కాగా, శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు వినిపిస్తోంది.

శిల్పా ఉచ్చులో మరి కొందరు ప్రముఖులు
శిల్పాచౌదరికి ఉన్న 6 బ్యాంక్ అకౌంట్స్‌పైదర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు . వివరాలు ఇవ్వాలంటూ నార్సింగి పోలీసులు బ్యాంకర్లకు లేఖ రాశారు . కొంత మంది బాధిత బడా మహిళలు మాత్రం ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. బ్లాక్ మనీ, ఐటీకి బయపడి ఫిర్యాదు చేయలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులకు చెప్పకుండా డబ్బులు ఇచ్చిన పేజ్ త్రీ మహిళలు తలలు పట్టుకుంటున్నారు. శిల్పా ఎపిసోడ్‌లో అనేక కోణాలున్నాయి.
Recommended Video

మరి కొందరు బయటకు వచ్చే ఛాన్స్
కొందరు పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరికొందరు మాత్రం కంప్లైంట్ చేయడానికి ముందుకు రావడం లేదు. తాజాగా హీరో సుధీర్‌బాబు భార్య ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఈ కేసులో ఇంకా మరికొందరు కూడా బయటకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తమకు బెయిల్ ఇవ్వాలంటూ రాజేంద్రనగర్ కోర్టు మెట్లెక్కారు శిల్పాచౌదరి, భర్త శ్రీనివాస్. కాదుకాదు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు పోలీసులు. ఈ రెండింటిపై విచారణ చేపట్టిన కోర్టు, విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications