వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గందరగోళం: టిఆర్ఎస్‌తో పొత్తుపై చంద్రబాబు ఇలా..రేవంత్ దారెటు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీలో పొత్తుల చర్చలు పార్టీలో గందరగోళానికి దారితీశాయి. పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహ్ములు అవసరమైతే టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొంటామని ప్రకటించడం సంచలనం రేపుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలను టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చారు. అయితే ఈ విషయమై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వైఖరి ఎలా ఉందనే విషయమై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.కానీ, 2019 ఎన్నికల్లో పొత్తుల విషయమై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఓ స్పష్టత ఇచ్చేశారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

తెలంగాణ ఉద్యమం టిడిపిని తీవ్రంగా నష్టపర్చింది. తెలంగాణలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు 2014 ఎన్నికల నాటికి ముందే పార్టీని వీడారు.2014 ఎన్నికల తర్వాత టిడిపి టిక్కెట్టుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఒక్క ఎంపి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.

అయితే ప్రస్తుతం తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున పొత్తులపై చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ ఇందుకు సానుకూలంగా స్పందించారు.

టిఆర్ఎస్‌తో పొత్తుపై చంద్రబాబు ఇలా...

టిఆర్ఎస్‌తో పొత్తుపై చంద్రబాబు ఇలా...


తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని ఇటీవల విజయవాడలో రేవంత్‌రెడ్డికి టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారని పార్టీలో ప్రచారంలో ఉంది. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్లతో చర్చించిన సందర్భంగా ఏ పార్టీతో పొత్తుంటే బాగుంటుందనే విషయమై చర్చించారని ప్రచారం సాగుతోంది. టిఆర్ఎస్, బిజెపి, లేదా విపక్షాల కూటమితో పొత్తు తదితర అంశాలపై చర్చ జరిగినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఏ పార్టీతో పొత్తు ఉంటుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.

టిఆర్ఎస్‌తో పొత్తుంటే రేవంత్ ఏం చేస్తారు?

టిఆర్ఎస్‌తో పొత్తుంటే రేవంత్ ఏం చేస్తారు?

తెలంగాణలో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతల్లో రేవంత్‌రెడ్డి పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పని పరిస్థితి ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో టిడిపి పొత్తు పెట్టుకొంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తారనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. టిఆర్ఎస్‌తోపొత్తు ఉండదని రేవంత్ రెడ్డి వర్గం బలంగా విశ్వసిస్తోంది. ఇప్పటి వరకు టిఆర్ఎస్‌పై పోరాటం చేసి అదే పార్టీతో పొత్తు పెట్టుకొంటే రాజకీయంగా ఇంకా తీవ్రంగా నష్టపోయే ప్రభావం ఉండే అవకాశం ఉందని రేవంత్ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా బలపడడం కంటే మరింత బలహీనపడతామనే అభిప్రాయం టిడిపిలో కొందరిలో ఉంది.రాజకీయంగా నష్టపోయే సమయంలో రేవంత్ వర్గీయులు ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తి నెలకొంది.

మోత్కుపల్లి ఎందుకీ వ్యాఖ్యలు చేశారు

మోత్కుపల్లి ఎందుకీ వ్యాఖ్యలు చేశారు

టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహ్ములు కాంగ్రెస్ పార్టీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు.కాంగ్రెస్ వ్యతిరేక సిద్దాంతంపైనే టిడిపి ఏర్పాటైన విషయాన్ని ప్రస్తావించారు. అయితే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను గద్దెదించేందుకు కాంగ్రెస్ పార్టీతో ఎలా పొత్తును పెట్టుకొంటామని మోత్కుపల్లి నర్సింహ్ములు ప్రశ్నించారు. అయితే టిఆర్ఎస్‌పై విరుచుకుపడే మోత్కుపల్లి అవసరమైతే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొనేందుకు సానుకూలంగా స్పందించడం కలకలాన్ని రేపుతోంది. అయితే విపక్షాల కూటమిలో టిడిపి ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారా.. లేక వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో పొత్తు విషయమై పార్టీ చీఫ్ చంద్రబాబు వైఖరికి అనుకూలంగానే మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారా అనే విషయమై చర్చ సాగుతోంది. అయితే పొత్తులపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.

కెసిఆర్ మైండ్‌గేమ్

కెసిఆర్ మైండ్‌గేమ్

తెలంగాణలో విపక్షాలను మరింత బలహీనపర్చేందుకు అధికార టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ వివాహనికి హజరయ్యారు కెసిఆర్. అంతేకాదు పరిటాల రవి సమాధి వద్ద నివాళులర్పించారు. తెలంగాణలో టిడిపికి అండగా ఉన్న ఓ సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకొనే ప్రయత్నాలను కెసిఆర్ చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విపక్షాలు ఐక్య కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో విపక్షాలను మరింత గందరగోళపర్చేందుకు కెసిఆర్ అనుసరిస్తున్న వ్యూహంలో విపక్షాలు చిక్కుకొన్నాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Even though 2019 general elections are still more than one-and-a-half year away, the state seems to have begun witnessing “realignment” of political forces.Indicating at their likely “alliance” in the 2019 general polls against TRS, Congress and TD. But some Tdp leaders interesting to alliance with Trs in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X