ప్రజల ఆరోగ్యం కాన్నా.. మీ ఆదాయమే ముఖ్యమా?: కేసీఆర్ సర్కారుపై రేవంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్: తెలంగాణలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా బార్లు, వైన్స్ షాపులు, హోటల్స్ వేళలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి.. ఇతర రాష్ట్రాలు కోవిడ్‌ను అదుపు చేయడానికి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నాయి.. కానీ, తెలంగాణ ప్రభుత్వం రాత్రి ఒంటి గంట దాకా బార్లకు అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 12 గంటల వరకు దాకా వైన్స్‌కు అనుమతి ఇవ్వడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రాణాలకంటే ఆదాయమే ముఖ్యమా..? అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. కాగా, ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెడుతున్న సమయంలో.. కట్టడికి పలు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

TPCC chief Revanth Reddy slams CM KCR for increasing liquor shop timings for new year celebrations

తెలంగాణ ప్రభుత్వం న్యూఇయర్ వేడుకలు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల సమయాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం టీఎస్ సర్కార్ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. మద్యం దుకాణాలు,. బార్లు, స్పెషల్ ఈవెంట్స్ కు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది. మద్యం షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, ఈవెంట్స్, టూరిజం హోటల్స్ కు రాత్రి 1 గంట వరకు విక్రయాలు జరుపుకోవడానికి అనుమతినివ్వడం జరుగుతుందని టీఆర్ఎస్ సర్కారు తెలిపింది.

మందుబాబులకు ఈ నిర్ణయం కొంత ఆనందాన్నిచ్చినప్పటికీ.. కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నేతలు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ఆదాయానికే ముఖ్యమైందని ధ్వజమెత్తుతున్నారు.

తెలంగాణలో కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరింది. కరోనా కేసులు కూడా రోజుకు వందకుపైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం 3వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+