సీఎం జగన్ కు రేవంత్ సూచన.. సాయిరెడ్డి తిక్కలోడు : పీసీసీ రావటానికి వారే కారణం : హుజూరాబాద్ పై తేల్చేసారు..!!

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రికి కీలక సూచన చేసారు. అదే సమయంలో పలు విమర్శలు గుప్పించారు. ఒక ఇంటర్వ్యూలో రేవంత్ తాజా రాజకీయాల పైన స్పందించారు. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల గురించి ఏపీ సీఎం జగన్ కు ఆందోళన అవసరం లేదన్నారు. వారి మీద జాలి..దయ చూపాల్సిన పరిస్థితి లేదని..తాము వారికి కవచంగా ఉంటామన్నారు. వైఎస్సార్ ను టీఆర్ఎస్ నేతలు తిడుతుంటే విజయమ్మ..జగన్ మౌనంగా ఉండటం వైఎస్సార్ అభిమానులకు నచ్చటం లేదని చెప్పుకొచ్చారు.

సాయిరెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు..

సాయిరెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు..

ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య నీటి కోసం జరుగుతున్నది నిజమైనది కాదని..ఇది డూపు ఫైటింగ్ అంటూ రేవంత్ విమర్శించారు. ఇక, తన సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేశపరుడని..తొలుత ఆ రకంగా స్పందించినా...తరువాత అర్దం చేసుకున్నారని చెప్పారు. తన పైన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్..సుధీర్ రెడ్డి పైన రేవంత్ మండిపడ్డారు. వాళ్లు చిల్లరగాళ్లు అంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి ని తిక్కలోడు అంటూ కామెంట్ చేసారు. ఆయన అణాపైసకు పనికి రారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పీసీసీ ఇప్పించల సమర్ధత చంద్రబాబుకు ఉందంటూ విజయ సాయిరెడ్డి సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. తనకు పీసీసీ రావటానికి కారణాలను రేవంత్ వివరించారు.

పదవి రావాటానికి వారి సహకారం..

పదవి రావాటానికి వారి సహకారం..

పీసీసీ చీఫ్ గా ఇచ్చేందుకు తన పేరు ప్రతిపాదనకు రాగానే..గతంలో స్టేట్ ఇన్ ఛార్జ్ లుగా పని చేసిన ఏకే అంటోని..వాయిలార్ రవి..గులాం నబీ ఆజాద్..దిగ్విజయ్ సింగ్ లాంటి వారి అభిప్రాయం తీసుకున్న తరువాత నే తనకు పదవి అప్పగించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ చెప్పిన నీళ్లు జగన్ దోచుకుంటున్నారు...నిధులు వారసులు తీసుకుపోతున్నారని..నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయని రేవంత్ ఆరోపించారు. కేటీఆర్ అవినీతి చేస్తే తండ్రికి తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు.

హుజూరాబాద్ నాకు పరీక్ష కాదు..

హుజూరాబాద్ నాకు పరీక్ష కాదు..

హుజూరాబాద్ ఎన్నిక తనకు పరీక్ష కాదని రేవంత్ స్పష్టం చేసారు. ఉప ఎన్నికల్లో నాయకుడి సమర్ధత ఆధారంగా ఓట్లు వేయరని..స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే గెలుపు ఓటములు ఉంటాయన్నారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ ఎప్పుడూ అక్కడ గెలవలేదని చెప్పుకొచ్చారు. అక్కడ ఈటెల సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా పని చేసారని..ఆయనకు ఓట్లు పడతాయి కానీ, బీజేపీ కాదన్నారు. కేసీఆర్..ఈటల చెరో రెండు వందల కోట్ల ఖర్చుతో హుజూరాబాద్ ఎన్నికల్లో తలపడుతున్నారని ఆరోపించారు.

ప్రగతి భవన్ పై కాంగ్రెస్ జెండా..

ప్రగతి భవన్ పై కాంగ్రెస్ జెండా..

తాను వేలాది మంది పార్టీ కార్యకర్తలతో మొహరిస్తారనని ప్రకటించారు. ఈటల కాంగ్రెస్ లోకి రాకుండా కేసీఆర్ బీజేపీలోకి వెళ్లేలా వ్యూహం అమలు చేసారంటూ చెప్పుకొచ్చారు. ఈటల సైతం తన పైన కేసీఆర్ కేసుల పరంగా వేధింపు లకు గురి చేస్తారనే కారణంతోనే షెల్టర్ కోసం బీజీపీలోకి వెళ్లారన్నారు. ప్రగతి భవన్ పైన ఖచ్చితంగా కాంగ్రెస్ జండా ఎగుర వేస్తానని రేవంత్ స్పష్టం చేసారు. పాదయాత్ర విషయంలో పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం ఉంటుందన్నారు. పార్టీలో అందరి అభిప్రాయాలకు గౌరవం ఇస్తానని...ప్రజల్లోకి వెళ్లినప్పుడు తన సహజ శైలిలో ఉంటానని రేవంత్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+