ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ - జగన్ అప్పుడు సహకరించేలా : రేవంత్ సంచలనం..!!

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఏపీలో పార్టీ ఏర్పాటు గురించి కేసీఆర్ వ్యాఖ్యలు..ఏపీ మంత్రి పేర్ని నాని స్పందన అనుకోకుండా జరిగినవి కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్‌, కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారంటూ ఆరోపించారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర సైతం అందులో భాగమేనని చెప్పుకొచ్చారు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. జగన్‌ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ కలలు కంటున్నట్లుగా ఉందన్నారు.

ఏపీ మంత్రి వ్యాఖ్యలను ఎందుకు ఖండించటం లేదు

ఏపీ మంత్రి వ్యాఖ్యలను ఎందుకు ఖండించటం లేదు

ఏపీ మంత్రి పేర్ని వ్యాఖ్యలను ఖండించకుండా టీఆర్‌ఎస్‌ మౌనంగా ఉందంటే అర్థమేంటని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ స్టే ఇవ్వటం పైన రేవంత్ స్పందించారు. దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేసిన సీఎం కేసీఆర్‌ను జూరాల కట్ట మీద, శ్రీశైలం గట్టు మీద ఉరి తీసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. కల్వకుర్తి కట్ట కింద కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి పాతరేయాలని మండిపడ్డారు. కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించారు. భీమవరంలో పోటీ చేస్తారా...బొబ్బలి నుంచి బరిలోకి దిగుతారా అంటూ రేవంత్ నిలదీసారు.

కేసీఆర్ ఎందుకు అనుసరించటం లేదు

కేసీఆర్ ఎందుకు అనుసరించటం లేదు

దీనికి కొనసాగింపుగా... ప్రాజెక్టు పనులు మధ్యలో ఆగిపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, దక్షిణ తెలంగాణకు ఇది మరణ శాసనమేనని వ్యాఖ్యానించారు. 2017లో పర్యావరణ అనుమతుల కోసం పెట్టుకున్న దరఖాస్తులను ఎవరి ఒత్తిడికి తలొగ్గి ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. పర్యావరణ అనుమతులు లేని పట్టిసీమ ప్రాజెక్టును తీర్పు వచ్చేలోపే ఏపీ పూర్తి చేయడంతో.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టును కూల్చలేమంటూ ఎన్జీటీ జరిమానా విధించి వదిలేసిందని గుర్తు చేశారు. అదే సూత్రాన్ని కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ ఎందుకు అనుసరించలేదని నిలదీశారు.

కేసీఆర్ తో బంధం పైన పేర్ని నాని వ్యాఖ్యలు

కేసీఆర్ తో బంధం పైన పేర్ని నాని వ్యాఖ్యలు

పాతసచివాలయాన్ని కూల్చొద్దంటూ తాను ఎన్జీటీ, సుప్రీంకోర్టులో కేసు వేస్తే.. తుషార్‌ మెహతా వంటి ఉద్దండులైన న్యాయకోవిధులను పెట్టి వాదనలు వినిపించిన ప్రభుత్వం.. పాలమూరు కేసులో అలా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇదే సమయంలో ఏపీ మంత్రి పేర్ని నాని మరో సారి కేసీఆర్ వ్యాఖ్యలకు స్పందనగా కీలక వ్యాఖ్యలు చేసారు. వాళ్లు కోర్టుల్లో కేసులు వేశారు. అలాంటి వాళ్లతో ఇంకేం సావాసం ఉంటుందంటూ పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి మంత్రి నాని ప్రశ్నించారు.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
    కేసీఆర్ రాజకీయ వ్యాఖ్యల పైన ఏపీలోనూ చర్చ

    కేసీఆర్ రాజకీయ వ్యాఖ్యల పైన ఏపీలోనూ చర్చ

    డిండి, పాలమూరు ప్రాజెక్టు లు పెట్టుకుని... పంపింగ్‌ పేరుతో పర్యావరణ, ఇతర అనుమతులు లేకుండా తాగునీరు పేరుతో సాగు అవసరాలకు అప్పట్లో తెలంగాణ మళ్లించిందన్నారు. దీనిపై అప్పటి సీఎం చంద్రబాబు అపెక్స్‌ కమిటీకి లేఖ రాశారని చెప్పారు. ఈ లేఖకు ప్రత్యుత్తరమిస్తూ.. కృష్ణా జలాల్లో తమ వాటా నీటిని మాత్రమే వాడుకుంటామని తెలంగాణ చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. తెలంగాణ మాదిరే మనమూ ఎత్తిపోతల పెట్టి రాయలసీమకు తాగునీరు ఇద్దామనుకున్నామంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. దీంతో...పార్టీ ప్లీనరీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఇటు తెలంగాణ..అటు ఏపీలోనూ వాటి స్పందనగా రాజకీయ కౌంటర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+