కాంగ్రెస్ అభ్యర్ధుల లిస్టు సిద్దం - ఫైనల్ జాబితాలో ఉన్నదెవరు..!!
తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇప్పటికే అదికార బీఆర్ఎస్ అభ్యర్దులను ఖరారు చేసింది. ఇప్పుడు తమ పార్టీ అభ్యర్దులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల పేర్లను హైకమాండ్ కు రికమెండ్ చేయనుంది. సాధ్యమైనంత త్వరగా అభ్యర్దులను ప్రకటించాలని భావిస్తోంది. ఇప్పటికే కొందరు అభ్యర్దులు దాదాపు ఫైనల్ అయ్యారు.
కాంగ్రెస్ జాబితాపై కసరత్తు:వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన ఆశావాహుల అభ్యర్దిత్వాలను పీఈసీ పరిశీలించింది. నియోజవకర్గాల వారీగా షార్ట్ లిస్ట్ చేసింది. ఈ జాబితాను టీపీసీసీ సీల్డ్ కవర్ లో స్క్రీనింగ్ కమిటీకి అందచేయనుంది. 26 నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్దిని ఎంపిక చేసినట్లు సమాచారం. కొన్నినియోజకవర్గాల్లో ఇద్దరు, మరి కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు చొప్పున పేర్లను లిస్టులో సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మురళీధరన్ లీడ్ చేస్తున్న స్క్రీనింగ్ కమిటీ గాంధీభవన్ లో సమావేశం కానుంది. ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాత స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్ని స్థానాలకు ఏకాభిప్రాయంతో అభ్యర్ధులను ఎంపిక చేసే అవకాశం ఉందనేది ఫైనల్ చేయనున్నారు.

వీరి పేర్లు ఖరారు అయినట్లే:ఇప్పటికే కొన్ని స్థానాలను దాదాపు ఖరారు చేసారు. ఆ జాబితాలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, మధిర నుంచి భట్టి విక్రమార్క, హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగిత్యాల - జీవన్ రెడ్డి, మంధని - శ్రీధర్ బాబు, సంగారెడ్డి- జగ్గారెడ్డి, ములుగ- సీతక్క, భద్రాచలం - పొదెం వీరయ్య, ఆంథోల్ - దామోదర రాజనర్సింహ, మంచిర్యాల - ప్రేమ సాగర్ రావు, పరిగి- రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీం పట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి, కోడాద - పద్మావతి రెడ్డి, వికారాబాద్ - గడ్డం ప్రసాద కుమార్, జహీరాబాద్ - ఏ చంద్రశేఖర్, బోధన్ - సుదర్శన్ రెడ్డి, నాంపల్లి - ఫిరోజ్ ఖాన్, భూపాల పల్లి - గండ్ర సత్యానారయణ, వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ, నర్సంపేట- దొంతి మాధవ రెడ్డి, హుజూరాబాద్ - బల్మూరి వెంకట్, వేములవాడ- ఆది శ్రీనివాస్ పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ఈ నెలలోనే తుది జాబితా:జడ్చర్ల - అనిరుధ్ రెడ్డి, మక్తల్ - ఎర్ర శేఖర్, నిర్మల్ - కూచాడి శ్రీహరి రావు, చొప్పదండి - మేడిపల్లి సత్యం, నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జైవీర్ పేరు దాదాపు ఖాయమని సమాచారం. ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో ఖాయమనే ప్రచారంలో ఉన్న నేతలకు సీట్లు ఇవ్వద్దంటూ నిరసనలు మొదలయ్యాయి. వనపర్తి సీటు చిన్నారెడ్డికి ఇవ్వద్దంటూ గాంధీ భవన్ లో నియోజకవర్గ కార్యకర్తలు నిరసనకు దిగారు.
అదే సమయంలో, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐకి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రతీ లోక్ సభ నియోజకవర్గంలో రెండు స్థానాలు బీసీలకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో సోనియా పర్యటన ఖాయం అవ్వటంతో ఆ సమయంలోనే అన్ని స్థానాలకు అభ్యర్దులను ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications