కోమటిరెడ్డి పై తేల్చేసిన క్రమశిక్షణా సంఘం, నెక్స్ట్ ఇక..!!

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో కొందరు నేతలు గీత దాటటం పైన అధినాయకత్వం ఆగ్రహంగా ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ..ఈ తరహా వివాదాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అందులో భాగంగా మంత్రి పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచూ చేస్తున్న వ్యాఖ్యల విషయం సంచలనంగా మారింది. దీని పైన టీపీసీసీ ఫోకస్ చేసింది. ఇక, ఇదే అంశం పైన టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ మల్లు రవి అసలు విషయం తేల్చేసారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన హామీ దక్కింది. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కలేదు. తన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వటం పైన హైకమాండ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో.. తనకు మంత్రి పదవి రాకపోవటం పైన ఆగ్రహంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసారు. దీని పైన టీపీసీసీ ఫోకస్ చేసింది. కాగా, తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అంశంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రాజగోపాల్‌ రెడ్డిపై ఫిర్యాదు వస్తే చర్చిస్తానని స్పష్టం చేసారు. రాజగోపాల్‌ రెడ్డిపై ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తే కమిటీ చర్చించదని తేల్చి చెప్పారు.

tpcc-disciplinary-committee-chairman-mallu-ravi-clarifies-over-action-against-rajagopal-reddy

ఈ రోజు (ఆదివారం) గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మల్లు రవి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన స్పందించారు. అదే విధంగా సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయంపై నర్సారెడ్డిని వివరణ ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. పూజల హరికృష్ణపై ఫిర్యాదు వస్తే వివరణ అడిగామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో చేరికలను ఆహ్వానించామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని విమర్శించారు. కేటీఆర్ రాజకీయ నాయకుడు అయితే తాము సన్యాసులమా? అని ఫైర్ అయ్యారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్‌లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+