Mahesh Kumar Goud: ఈడీ దాడులకు భయపడం.. మహేశ్ కుమార్ గౌడ్..!
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతోన్నాయి. ఈడీ దాడులపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈడీ సోదాలు చేపిస్తున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు చేయడం మంచిది కాదని అన్నారు. ఐడీ గత 10 ఏళ్లలో ప్రతిపక్ష పార్టీలపై ఫోకస్ పెట్టిందన్నారు. 97 శాతం ప్రతపక్ష నాయకులపై దాడులు జరిగాయని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. దాడులు భయపడబోమని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రతో ఈడీతో దాడుల చేయిస్తుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారిని పొలిటికల్ గా ఎదర్కొలేక ఇలా కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తుందని ఆరోపించారు. కర్ణాటకలో డీకే శివ కుమార్ ను కూడా ఇలానే వేధించారని అన్నారు. భవిష్యత్ లో బీజేపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ (Hyderabad)లోని నందగిరి హిల్స్‌లో ఉన్న మంత్రి నివాసం, హిమాయత్ సాగర్‌లోని ఫామ్ హౌజ్, పొంగులేటి కుమార్తె, బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది.
గత సంవత్సరం ఈడీ బీఆర్ఎస్ ఎంపీఇళ్లలో కూడా సోదాలు చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications