గణపతి మహా నిమజ్జనానికి వేళాయే.. ట్రాఫిక్ రూట్స్ ఛేంజ్ !
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో గణపతి బప్పాను ఆరాధిస్తూ పూజలు, ఊరేగింపులు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ ఉత్సవాలకు విశేషమైన స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేసి అంతే వైభవంగా ముగింపు ఘట్టమైన నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం తరఫున పర్యావరణ హిత నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు సిద్ధం చేశారు. ఏదైనా సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు 040-27852482, 8712660600, 9010203626 నంబర్లను సంప్రదించవచ్చు. ఇప్పటికే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉండగా.. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలో పోలీసులు సెప్టెంబరు 6, 7 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉందనున్నట్టు ప్రకటించారు.

శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు.. అదే సమయంలో సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీసులు వెల్లడించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి గణేశ విగ్రహాలను హుస్సేన్ సాగర్ మరియు ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలించనున్నారు.
- బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమై చాంద్రాయణగుట్ట, చార్మినార్, అబిడ్స్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ చేరుతుంది.
- సికింద్రాబాద్ ప్రాంతం నుంచి వచ్చే విగ్రహాలు పాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలామైదాన్ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు సాగుతాయి.
- టోలిచౌకీ, మెహిదీపట్నం, లక్డీకాపూల్ ప్రాంతాల విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుతాయి.
- టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే విగ్రహాలను ఎంజే మార్కెట్ వరకే అనుమతిస్తారు. ఈ ప్రధాన మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణలు..
- సౌత్ ఈస్ట్ జోన్: కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఇతర మార్గాలకు పంపిస్తారు.
- సెంట్రల్ ప్రాంతాలు: అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసిఏ వద్ద కఠిన నియంత్రణలు అమల్లోకి వస్తాయి.
- ముఖ్య జంక్షన్లు: లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్ జంక్షన్లను పూర్తిగా మూసివేస్తారు.
- నార్త్ జోన్: పాట్నీ, పారడైజ్, రాణిగంజ్ చౌరస్తాలలో ట్రాఫిక్‌ను వేరే మార్గాలకు మళ్లిస్తారు.
పార్కింగ్ సదుపాయాలు
నిమజ్జనం వీక్షించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.
- ఎన్టీఆర్ స్టేడియం
- కట్టమైసమ్మ దేవాలయం
- పబ్లిక్ గార్డెన్స్
- బుద్ధభవన్ వెనుక
- ఆదర్శనగర్
- బీఆర్‌కే భవన్
- ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్
ఈ ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది.
విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలనుకునేవారు బేగంపేట, పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవడం మంచిదని సూచించారు. భారీ వాహనాలు కేవలం ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే ప్రయాణించాలన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications