వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటలకందని విషాదం సూపర్‌స్టార్ కృష్ణ మరణం: సీఎం కేసీఆర్, వెంకయ్యనాయుడు, చిరంజీవి నివాళులు!!

|
Google Oneindia TeluguNews

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మెగా స్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని వారంతా అభిప్రాయపడ్డారు.

సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన కృష్ణ: సీఎం కేసీఆర్

నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ నిర్వహించిన సూపర్ స్టార్ కృష్ణ ఐదు దశాబ్దాల పాటు సినీ ప్రపంచంలో అందించిన సేవలను గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్ విలక్షణ నటుడు కృష్ణ అని కొనియాడారు. 350కి పైగా సినిమాలలో నటించిన సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించే సాంఘిక చిత్రాలు నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతనఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు.వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.

తెలుగు తెరపై కృష్ణ గారి స్ఫూర్తి అజరామరం

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు పరమపదించటం అత్యంత విచారకరం అని ఆయన పేర్కొన్నారు. వారు ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు. తన సినిమాల్లో ప్రయోగాలకు పెద్ద పీట వేసిన కృష్ణ గారు, అనేక నూతన సాంకేతికతలను తెలుగు తెరకు పరిచయం చేశారు. సగటును ఏడాదికి పది సినిమాల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేయటం వారి నిబద్ధతకు నిదర్శనం. తెలుగు తెరపై వారి స్ఫూర్తి అజరామరం అంటూ కొనియాడారు.

మాటలకందని విషాదం : ఆవేదనతో చిరంజీవి

సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు .మాటలకందని విషాదం ఇది అని ఆయన పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదని పేర్కొన్న చిరంజీవి ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం వంటివారు అన్నారు . సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం వీటి కలబోత కృష్ణ గారు అని చిరంజీవి పేర్కొన్నారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు భారత సినీ పరిశ్రమలోనే అరుదు అని చిరంజీవి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రునివాళి అంటూ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్ బాబు కు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.

English summary
Chiranjeevi expressed grief that Superstar Krishna's death is a tragedy beyond words. and Venkaiah Naidu paid tributes to Krishna's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X