విషాదం : గుండెపోటుతో మాజీ మంత్రి యర్నేని సీతాదేవి మృతి..!

మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి మృతిచెందారు. సోమవారం ఉదయం ఆమె గుండెపోటుతో హైదరాబాద్‌లో క‌న్నుమూశారు. సీతాదేవి ముదినేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గా 2సార్లు ప్రాతినిధ్యం వహించిన సంగ‌తి తెలిసిందే. ఆమె ఎన్టీఆర్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సీతాదేవిది సొంతూరు ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కోడూరు.

ముదినేపల్లి నియోజకవర్గం నుంచి సీతాదేవి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. 1985 సంవత్సరం అలాగే 1994 సంవత్సరం లో అసెంబ్లీ ఎన్నికల్లో మద్దినేపల్లి నుంచి సీతాదేవి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి, గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేసిన‌ప్పుడు అనేక రకాల సంస్కరణలను కూడా తీసుకువచ్చారు. అంతేకాకుండా విజయ డైరీ డైరెక్టర్ గా కూడా ఎర్నేని సీతాదేవి పనిచేశారు. ఇక‌, ఆమె స్వ‌స్థ‌లంలోనే అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రేపు సీతాదేవి అంతక్రియలు జరగనున్నట్లు సమాచారం. సీతాదేవి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. హైదరాబాద్ లో నేటి (సోమ‌వారం) ఉదయం టిడిపి మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్ర‌మంలో సీతాదేవి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

Tragedy Former minister Yarneni Sita Devi died of heart attack

రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన కుటుంబం..

ఇక‌, ఆమె పార్ధీవదేహాన్ని ఈ రోజు సాయంత్రం స్వగ్రామం కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలం, కొండూరుకు తరలించనున్న‌ట్లు స‌మ‌చారం. ఆమె అంత్యక్రియలు కూడా అక్క‌డే జరగనున్నాయి. సీతాదేవి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త నాగేంద్రనాథ్ ఏపీ రైతాంగ సమాఖ్య, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న మ‌న మ‌ధ్య‌లేరు. గ‌త సంవ‌త్స‌ర‌మే ఆయ‌న మృతిచెందారు. నాగేంద్రనాథ్-సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఇక‌, నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కూడా రాజ‌కీయ నేప‌థ్యం ఉంది. ఆయ‌న కూడా కైకలూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. సీతాదేవి 2013లో బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. సీతాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్ర‌ముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+