ఇంట్లో సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భయానక వీడియో వైరల్
హైదరాబాద్ లో మరో విషాదకర ఘటన జరిగింది. ఇటీవల ఫ్రిజ్ డోర్ ఒపెన్ చేస్తుండగా.. కరెంట్ షాకుతో మహిళ మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఆ భవనం కుప్పకూలింది. అంతేకాక ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అలాగే ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడు ప్రభావంతో పక్కన ఉన్న ఇళ్లు ధ్వంసమై సామాన్లు పూర్తిగా చెల్లాచెదురయ్యాయి. ఈ షాకింగ్ ఘటన మేడ్చల్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
తెలంగాణలోని మేడ్చల్ పట్టణంలో ఆగస్టు 5 న ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానిక బస్టాండ్ సమీపంలో పూల దుకాణంతో పాటు మొబైల్ షాప్ నిర్వహిస్తున్న ఓ ఇంట్లో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక భవనం పూర్తిగా కూలిపోయింది. ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు తాకిడికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. అదే సమయంలో ఆ బిల్డింగ్ లో ఉన్న 3 దుకాణాలు భారీ పేలుడుకి ధ్వంసం అయ్యాయి. అలాగే సిలిండర్ పేలుడు ధాటికి పక్కన ఉన్న ఇళ్లు ధ్వంసమై సామాన్లు పూర్తిగా చెల్లాచెదురు అయ్యాయి. ప్రమాదస్థలిలో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి
— Telugu Stride (@TeluguStride) August 5, 2025
మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ లో ఓ ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో చెలరేగిన మంటలు
పేలుడు ధాటికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి మృతి, ఇల్లు పూర్తిగా ధ్వంసం
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు. #Medchal #Telangana pic.twitter.com/sCgr6wAAKn
ఇటీవల హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు, సిలిండర్ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఇటీవల పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఫ్రిడ్జ్ డోర్ తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది. అలాగే గతంలో దోమలగూడలో భారీ పేలుడు సంభవించింది. బోనాల పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్ లోనే మృతిచెందారు.
తాజాగా మేడ్చల్ పట్టణంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరాములు గౌడ్ అనే వ్యక్తికి మేడ్చల్ పట్టణంలో మార్కెట్ రోడ్డు పక్కన ఒక భవనం ఉంది. పాతకాలం నాటి ఈ భవనంలో.. రోడ్డు వైపున ఒక మొబైల్ షాప్, రెండు పూల దుకాణాలు ఉన్నాయి. శ్రీరాముల గౌడ్ ఇంటి వెనకాల ఉన్న మరో గృహంలో అతడి చెల్లెలు నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి రాత్రి ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది.

ఈ ప్రమాదంలో భవనంలో ఉన్న మూడు షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బిల్డింగ్ శిథిలాలు చుట్టు పక్కల ప్రాంతాల్లోకి ఎగిరి పడ్డాయి. ఈ ఘోరమైన ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే మేడ్చల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications